HBD Kartikeya: మరోసారి పవర్ఫుల్ విలన్ గా కార్తికేయ.. వాలిమై ఫస్ట్ లుక్ వైరల్

టాలెంటెడ్ హీరో కార్తికేయ జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సాధారణంగా హీరోగా ఇండస్ట్రీలో మంచి ట్రాక్ సెట్ అయిన తర్వాత మళ్లీ విలన్ రోల్స్ చేయడానికి ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపరు. కానీ కార్తికేయ మాత్రం ఆ స్టార్ డమ్ ను ఏమాత్రం లెక్కచేయకుండా నటుడిగా సరికొత్త అడుగులు వేస్తున్నాడు. వీలైనంతవరకు మంచి ఆఫర్స్ వస్తే ప్రతినాయకుడుగా కనిపించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ఇదివరకే చెప్పాడు. ఇక చెప్పినట్లుగానే మంచి ఆఫర్ రావడంతో ఒక అగ్ర హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో కార్తికేయ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ టాలెంటెడ్ హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ అందిస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఒక చేతిలో మొబైల్ ఫోన్ మరొక చేతిలో మందు గ్లాస్ తో కనిపిస్తున్న కార్తికేయ అజిత్ కు దీటుగా పోటీ ఇచ్చేలా ఉన్నాడని అనిపిస్తోంది. కార్తికేయ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. అయితే ఇది వరకే అతను నాని కథానాయకుడిగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా లో పవర్ఫుల్ విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కార్తికేయ కు ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కథలు నచ్చక ఒప్పుకోలేదట. ఇక ఫైనల్ గా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమా లో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Kartikeya powerful villain poster from valimai movie

విలన్ పాత్ర కోసం ఆ సినిమా దర్శకుడు చాలా మందిని సంప్రదించాడు. కొంతమంది కొత్తవాళ్లతో కూడా ఆడిషన్స్ నిర్వహించారట. కానీ అతనికి ఎవరు నచ్చకపోవడంతో ఫైనల్ గా కార్తికేయ ను సెలక్ట్ చేసుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ అద్భుతమైన నెగటివ్ పాత్రలో నటించడం వలన మంచి గుర్తింపు అందుకున్నాడు. వాలిమై సినిమా లో కూడా అతను ప్రతినాయకుడి పాత్రకు తప్పకుండా సెట్ అవుతాడని సింగిల్ సిట్టింగ్ లోనే ఫైనల్ చేసుకున్నారట. వాలిమై సినిమా షూటింగ్ కు ముందు కొంత వర్క్ షాప్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే బాడీ లాంగ్వేజ్ లో కూడా కార్తికేయ ప్రత్యేకంగా దర్శకుడితో ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.

ఇక ఫైనల్ గా సినిమా షూటింగ్ అయితే తుది దశకు చేరుకుంది. దాదాపు దర్శకుడు ముఖ్యమైన పనులన్నిటికి కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రేక్ధకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో విలన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక కార్తికేయ తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం దక్కింది. తెలుగులో ఇప్పటికే విభిన్నమైన కథలతో ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న కార్తికేయ మెల్లగా కోలీవుడ్ రంగంలో కూడా కిక్కవ్వాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా అతనికి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతొంది. హీరో అజిత్ ఈ సినిమాలో ఒక రేసర్ గా కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. మరి సినిమా విడుదల అనంతరం బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీకపూర్ వాలిమై సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X