చావు కబురు చల్లగా మూవీకి అదనపు హంగులు.. ఓటీటీ చరిత్రలో ఇదే మొదటి సారి!

టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సినిమాల పరంపరలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలు మూడు గంటలకు పైగా ఉండేవి. నెమ్మదిగా నిడివి తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం రెండు నుంచి రెండున్నర గంటల మధ్యలో సినిమాలు ఉంటున్నాయి. అయితే ఈ నిడివి తగ్గించడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు గంటల నుంచి రెండు గంటల 15 నిమిషాల లోపు సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ఒక్కోసారి ఆ నిడివి తగ్గించే ప్రక్రియలో అవసరమైన సీన్లు ఉన్నా సరే తొలగించాల్సి వస్తుంది. అలా తగ్గించి చాలా సినిమాలు నష్టపోయిన పరిస్థితి. అయితే అలా నష్టపోయినపుడు కొన్ని ఇంపార్టెంట్ అనుకున్న సీన్లు యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసే వాళ్ళు, ఒక్కోసారి ఆ వర్షన్ జనానికి నచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా విషయంలో జరుగుతున్న ప్రక్రియ ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

వీకెండ్ కూడా పూర్తికాకుండానే

వీకెండ్ కూడా పూర్తికాకుండానే

విషయం ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దానికి సీన్స్ యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు విషయానికి వస్తే ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చావు కబురు చల్లగా అనే ఒక సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ కావడానికి ముందు ఉన్న కాస్త పాజిటివ్ బజ్ వల్ల కాస్త ఓపెనింగ్స్ వచ్చాయి కానీ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో పూర్తిగా తేలిపోయింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా వీకెండ్ కూడా పూర్తికాకుండానే అడ్రస్ లేకుండా పోయింది.

ఎందుకలా హడావిడి చేస్తున్నారు

ఎందుకలా హడావిడి చేస్తున్నారు

ఇప్పుడు ఈ సినిమాను నిర్మాతల సొంత ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేస్తున్నారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ గా ఆడిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసినా, లేదు ఫ్లాప్ టాక్ తెచ్చుకుని వెళ్లిపోయిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన సరే ఎప్పుడూ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయడం లేదు. అయితే ఈ సినిమాకు ఎందుకలా హడావిడి చేస్తున్నారు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమా చాలా మందికి నచ్చలేదని ముందు సోషల్ మీడియా వేదికగా ఒప్పుకున్న హీరో కార్తికేయ ఈ సినిమాకు ఒక వర్గం నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయి అని చెప్పుకొచ్చాడు.

 చాలా కొత్త కథలు వస్తున్నాయట

చాలా కొత్త కథలు వస్తున్నాయట

మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా తనలో కొత్త కోణం చూశారని అందుకే ఈ సినిమా చూశాక చాలా కొత్త కథలు తనకోసం వస్తున్నాయని చెప్పుకొచ్చాడు.. అంతేకాదు ఈ సినిమాను ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నామని ధియేటర్లో చూసిన దానికంటే ఈ వర్షన్ మెరుగ్గా ఉందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి గతంలో ఇలాంటి సినిమాలు ఏవైనా రిలీజ్ అవుతున్న సమయంలో సోషల్ మీడియాలో మాత్రమే హడావుడి చేసేవార్..ఫలానా సినిమా ఫలానా రోజు నుంచి రిలీజవుతోందని, అంటూ హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో మరోపక్క ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

మళ్ళీ ఎక్స్ట్రా మేకప్ వేసి వదలడం ఎందుకో

మళ్ళీ ఎక్స్ట్రా మేకప్ వేసి వదలడం ఎందుకో

ఈ సినిమా నిర్మాత బన్నీ వాసు కావడం బన్నీవాసు బ్యాక్ బోన్ అయిన అల్లు అరవింద్ ఆహా ఓనర్ కావడంతో ఎలా అయినా ఈ సినిమాను ఆహా ద్వారా ప్రేక్షకుల అందరికీ చూపించాలని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఈ రకమైన ప్రచారం జరుగుతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. చావు కబురు చల్లగా అంటూ వచ్చి ఎప్పుడో వెళ్లిపోయిన ఈ సినిమాకు ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మేకప్ వేసి వదలడం ఏమిటనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. మరి చూడాలి ఈ సినిమాకు ఏ మేరకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతుందో ?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X