Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
KGF 2 యష్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్.. మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా..
కన్నడ సినిమా ఇండస్ట్రీలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో యష్. ఒకే ఒక్క పాన్ ఇండియా సినిమాతో తన మార్కెట్ ని అమంతగా పెంచేసుకున్న ఈ స్టార్ హీరో భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా అంచనాలు రెట్టింపవుతాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక యష్ ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు అనే విషయం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
KGF 2 బిజినెస్..
KGF సినిమాతో కన్నడ ఇండస్ట్రీ స్థాయిని కూడా అమితంగా పెంచిన యష్ కోసం ఇప్పుడు కేవలం ఒక భాషకు చెందిన నిర్మాతలే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని బడా నిర్మాతలు కూడా అతను డేట్స్ ఇస్తే సినిమాను ఎనౌన్స్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే KGF 2 సినిమా తప్పకుండా 500కోట్ల వరకు బిజినెస్ చేయలగలదని ఒక క్లారిటీ వచ్చేసింది.
యష్ రెమ్యునరేషన్ ఎంత?
తమిళ్, టాలీవుడ్ అలాగే బాలీవుడ్ కి చెందిన కొన్ని బడా నిర్మాణ సంస్థలు యష్ కోసం కథలు రెడీ చేయిస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక యష్ ఇక నుంచి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాల్లో ప్రాఫిట్స్ లో షేర్స్ తీసుకోవాలని చూస్తున్నాడట. KGF 1 సినిమాకు కేవలం 15కోట్ల లోపే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సెకండ్ పార్ట్ విషయంలో అలాంటి పొరపాటు చేయవద్దని డిసైడ్ అయ్యాడు.
KGF 2 కోసం ఎంత తీసుకుంటున్నాడు?
KGF 2సినిమాకు ఒపెనింగ్స్ గట్టిగానే వస్తాయని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ సినిమా కోసం మినిమమ్ 30కోట్ల వరకు షేర్స్ అందుకునే ఛాన్స్ ఉందట. ఈ లెక్క కేవలం ఒక అంచనా మాత్రమే. బాక్సాఫీస్ కక్లెక్షన్స్ ఇంకా ఎక్కువైతే మరింత లాభం వచ్చే అవకాశం ఉందట. నిజంగా సినిమా నిర్మాతలకు ఈ విధమైన షేర్స్ ఇవ్వడానికి పెద్దగా ఇబ్బందులు ఉండవు.
Recommended Video
ప్రభాస్ తరహాలోనే పాన్ ఇండియా సినిమాలు
మొత్తానికి రెమ్యునరేషన్ విషయంలో ఒక క్లారిటికి వచ్చిన యష్ KGF 2 తరువాత ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. తమిళ్, తెలుగు నుంచి కొందరు నిర్మాతలు యష్ తో ఎలాగైనా మరో పాన్ ఇండియా సినిమాను నిర్మించాలని అనుకుంటున్నారట. ఇక యష్ కూడా తన మార్కెట్ ని మరింత పెంచుకోవాలని ప్రభాస్ తరహాలోనే ఇతర ఇండస్ట్రీలోని నిర్మాతలతో కూడా బిగ్ బడ్జెట్ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.