మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రవితేజ: ఆరోజే అలరించబోతున్న మాస్ మహారాజా

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు టాలెంటెడ్ హీరో రవితేజ. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు మజాను పంచే క్యారెక్టర్లు చేస్తూ మాస్ మహారాజా అనిపించుకున్నాడు. చాలా రోజుల పాటు హిట్ల మీద హిట్లు కొట్టిన రవితేజ.. ఈ మధ్య పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడీ సీనియర్ హీరో.

ఈ సంక్రాంతికి 'క్రాక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీనితో పాటు కలెక్షన్లను కూడా రాబడుతూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌లో ఉన్న మాస్ మహారాజా.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న 'ఖిలాడీ'లో నటిస్తున్నాడు. ఇటీవలే సెట్స్ మీద దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి 'ఇన్ యాక్షన్ మోడ్' అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

 Khiladi glimpse will Release on his Ravi Teja Birthday

సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన పోస్టర్‌లో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా గ్లిమ్స్ వీడియో మాస్ మహారాజా పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధిచిన వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X