విశాల్‌పై ప్రశంసలు కురిపించిన ఖుష్బూ!
హీరో విశాల్ తరచుగా వార్తల్లో ఉండే వ్యక్తి. విశాల్ సినిమాల పరంగానే కాక తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటాడు. విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం విశాల్ సీనియర్ నటి ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ టర్కీలో జరుగుతోంది. ఈ చిత్రానికి ఖుష్బూనే నిర్మాత.
ఇటీవల ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా విశాల్ గాయపడ్డాడు. రెండురోజులు విశ్రాంతి తీసుకుని మూడోరోజు షూటింగ్ కు హాజరయ్యాడు. గాయం నుంచి విశాల్ పూర్తిగా కోలుకోకున్నా నొప్పిని భరిస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీనితో ఖుష్బూ విశాల్ పై ప్రశంసలు కురిపిస్తోంది. విశాల్ ని ఎలా అభినందించాలో కూడా అర్థం కావడం లేదని ఖుష్బూ తెలిపింది.

నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో విశాల్ బాధని భరిస్తూనే షూటింగ్లో పాల్గొంటున్నాడని ఖుష్బూ తెలిపింది. ఇటీవల విశాల్ కు హైదరాబాద్ కు చెందిన అనీషా అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట వివాహంతో ఒక్కటి కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











