అఖిల్‌కు జోడిగా స్టార్ హీరోయిన్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో!
అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలతో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం నుంచి అఖిల్ కు నిరాశే ఎదురవుతోంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మూడూ వరుసగా నిరాశపరిచాయి. దీనితో అఖిల్ తొలి విజయం మరోమారు వాయిదా పడ్డట్లు అయింది. ఈ సారి అఖిల్ మంచి కథని ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ వినిపించిన కథ నచ్చడంతో అతడు ప్లాపుల్లో ఉన్నా అఖిల్ ఒకే చేశాడట.
తాజాగా ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు అఖిల్ అంతగా గుర్తింపు లేని యంగ్ హీరోయిన్లతో నటించాడు. కానీ ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాలని బొమ్మరిల్లు భాస్కర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ పేరు వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది.

కియారా అద్వానీ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ ఏడాది రాంచరణ్ సరసన నటించిన వినయ విధేయ రామ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అఖిల్ కు హీరోయిన్ గా నటించే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











