చిరంజీవికి రాంచరణ్ అద్భుతమైన గిఫ్ట్.. భావోద్వేగంతో సుదీప్ కిచ్చ వెల్లడి

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి పాత్రలను పోషిస్తూ ఆకట్టుకొంటున్న సుదీప్ కిచ్చ ప్రస్తుతం పహిల్వాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా సైరా చిత్రంలోని పాత్ర గురించి పలు విషయాలను వెల్లడించారు. సుదీప్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

సైరాలో నా పాత్ర ఏంటంటే

సైరాలో నా పాత్ర ఏంటంటే

సైరా నర్సింహారెడ్డి చిత్రంలో అవుకురాజు పాత్రలో నేను నటిస్తున్నాను. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితంలో అవకరాజు పాత్ర కీలకం. అలాంటి పాత్రలో నేను నటిస్తున్నాను. సుదీప్ కాకుండా ఎవరు చేసిన ఆ పాత్రకు గొప్ప పాత్ర ఉంటుంది. ఆ పాత్రకు అంత విశేషం ఉంటుంది. నా పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంటుంది. సినిమా రిలీజ్ తర్వాత నాకు మంచి పేరు వస్తుంది అని సుదీప్ అన్నారు.

చిరంజీవితో నటించడంపై

చిరంజీవితో నటించడంపై

చిరంజీవితో నటించడం అనే మాట పక్కన పెడితే.. ఆయనతో పక్కన నటించే చిన్న పాత్రయైనా గొప్ప అనుభూతి ఉంటుంది. అలాంటి అవకరాజు పాత్రకు నన్ను ఎంపిక చేసుకోవడం గర్వంగా ఉంది. ఈ సినిమా చిరంజీవికి సరైన సినిమా. అలాంటి పాత్రను ఆయన మాత్రమే చేయగలడు. సైరా వెండితెర మీద అద్భుతమైన చిత్రం అని సుదీప్ పేర్కొన్నారు.

రాంచరణ్ ఇస్తున్న గొప్ప గిఫ్ట్

రాంచరణ్ ఇస్తున్న గొప్ప గిఫ్ట్

సైరా సినిమా గురించి గొప్పగా చెప్పాలంటే.. మెగాస్టార్ చిరంజీవికి నిర్మాతగా ఆయన కుమారుడు రాంచరణ్ నిర్మించడం. ఓ తండ్రికి కొడుకు ఇచ్చే ఇంత కంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది? అని సుదీప్ అన్నారు. నా పాత్ర ఎలా ఉంటుందని ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన పక్కన నిలబడి నటించడమే గొప్ప. అదే నాకు, నా కెరీర్‌లో గొప్పగా నిలిచిపోతుంది అని సుదీప్ అన్నారు.

జీవితంలో అలాంటి అవకాశం ఒక్కసారే

జీవితంలో అలాంటి అవకాశం ఒక్కసారే

సైరా లాంటి చిత్రంలో అదీ చిరంజీవి పక్కన నటించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. జీవితంలో ఇలాంటి అవకాశాలు మన్నలి తట్టుతాయి. ఆ ఛాన్స్‌ను అందిపుచ్చుకొని నటించడమే మంచి ఫీలింగ్. దానిని ఎంజాయ్ చేయాలి. సైరా చిత్రం చరిత్రలో నిలిచిపోయే చిత్రం. దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు అని సుదీప్ తన అనుభూతిని పంచుకొన్నారు.

RRRలో నటించడం లేదు

RRRలో నటించడం లేదు

ఇక RRRలో తన పాత్ర గురించి సుదీప్ క్లారిటీ ఇచ్చారు. ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రంలో తాను నటించడం లేదు అని స్పష్టం చేశారు. తాను నటిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అందులో వాస్తవం లేదు అని సుదీప్ పేర్కొన్నారు. తాజాగా వస్తున్న పహిల్వాన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుకొంటుంది అని చెప్పారు.

అవుకు రాజుగా సుదీప్

అవుకు రాజుగా సుదీప్

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై హీరో రాంచరణ్ నిర్మాతగా రూపొందించిన సైరా సినిమా అక్టోబర్ 2న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రూ.300 కోట్లతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్‌గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X