Don't Miss!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగాస్టార్‌లా నా జీవితం నాశనం చేసుకోలేను: సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రమైన 'సైరా నరసింహారెడ్డి'లో కీలక పాత్ర పోషించారు కన్నడ సినీ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. రక్తచరిత్రతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సుదీప్.. ఈగ చిత్రంలో విలన్ పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక, బాహుబలిలో చిన్న పాత్రే అయిన సుదీప్ మెప్పించారు.
చిరంజీవిని చూసి అదే నేర్చుకున్నా..
ప్రస్తుతం సైరా చిత్రంలో చిరంజీవితోపాటు ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో చిరంజీవి రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుదీప్. రాజకీయాల్లోకి రావొద్దని చిరంజీవిని చూసి నేర్చుకున్నానని సుదీప్ వెల్లడించారు.
మెగాస్టార్‌లా నా జీవితం నాశనం చేసుకోలేను..
సైరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సినిమా ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవిని చూసే నేర్చుకున్నాని తెలిపారు. రాజకీయాలు పదేళ్ల చిరంజీవి సినీ జీవితాన్ని నాశనం చేశాయని, అందుకే తాను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లనని స్పష్టం చేశారు.
సైరాలో కీలక పాత్ర..
సైరా చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, అనుష్క, తమన్నా, నాగబాబు కూతురు నిహారిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవుకు రాజు పాత్రలో సుదీప్ కనిపించబోతున్నారు. కాగా, సుదీప్ నటించిన పహిల్వాన్ చిత్రం తాజాగా తెలుగులో కూడా విడుదలైంది.
భారీ అంచనాలతో సైరా..
దేశంలోని ప్రముఖ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటులు సైరా చిత్రంలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సైరా చిత్రం విడుదలవుతోంది. తాజాగా విడులైన సైరా ట్రైలర్ నెట్టింట్లో రికార్డులను తిరగరాస్తోంది.