twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్‌లా నా జీవితం నాశనం చేసుకోలేను: సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు

    |

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రమైన 'సైరా నరసింహారెడ్డి'లో కీలక పాత్ర పోషించారు కన్నడ సినీ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. రక్తచరిత్రతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సుదీప్.. ఈగ చిత్రంలో విలన్ పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక, బాహుబలిలో చిన్న పాత్రే అయిన సుదీప్ మెప్పించారు.

    చిరంజీవిని చూసి అదే నేర్చుకున్నా..

    చిరంజీవిని చూసి అదే నేర్చుకున్నా..

    ప్రస్తుతం సైరా చిత్రంలో చిరంజీవితోపాటు ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో చిరంజీవి రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుదీప్. రాజకీయాల్లోకి రావొద్దని చిరంజీవిని చూసి నేర్చుకున్నానని సుదీప్ వెల్లడించారు.

    మెగాస్టార్‌లా నా జీవితం నాశనం చేసుకోలేను..

    మెగాస్టార్‌లా నా జీవితం నాశనం చేసుకోలేను..

    సైరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సినిమా ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవిని చూసే నేర్చుకున్నాని తెలిపారు. రాజకీయాలు పదేళ్ల చిరంజీవి సినీ జీవితాన్ని నాశనం చేశాయని, అందుకే తాను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లనని స్పష్టం చేశారు.

    సైరాలో కీలక పాత్ర..

    సైరాలో కీలక పాత్ర..

    సైరా చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, అనుష్క, తమన్నా, నాగబాబు కూతురు నిహారిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవుకు రాజు పాత్రలో సుదీప్ కనిపించబోతున్నారు. కాగా, సుదీప్ నటించిన పహిల్వాన్ చిత్రం తాజాగా తెలుగులో కూడా విడుదలైంది.

    భారీ అంచనాలతో సైరా..

    భారీ అంచనాలతో సైరా..

    దేశంలోని ప్రముఖ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటులు సైరా చిత్రంలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సైరా చిత్రం విడుదలవుతోంది. తాజాగా విడులైన సైరా ట్రైలర్ నెట్టింట్లో రికార్డులను తిరగరాస్తోంది.

    English summary
    Kichcha Sudeep, who is basking in the success of his recently released film Pailwaan, is waiting for his upcoming Telugu film, Sye Raa Narasimha Reddy, to hit the screens.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X