స్టన్నింగ్ లుక్కుతో అభిమానులకు కిక్కిచ్చిన స్టార్ హీరో

లాక్ డౌన్ సినిమా పరిశ్రమను గట్టి దెబ్బె కొట్టినప్పటికి కొంత మంది స్టార్ హీరోలకు మాత్రం చాలా ఉపయోగపడింది. చాలా కాలం తరువాత ఒక కొత్త లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయడం అలాగే ఫిట్నెస్ విషయంలో కూడా ఏదైనా కొత్తగా ట్రై చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఇక కన్నడ హీరో సుదీప్ కూడా అదే తరహాలో వర్కౌట్స్ చేశాడు.

RGV రక్త చరిత్ర సినిమా తరువాత టాలీవుడ్ కి బాగా దగ్గరైన సుదీప్.. ఈగ సినిమా నుంచి విలన్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. నెగిటివ్ పాజిటివ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో ఇతర ఇండస్ట్రీలోని ప్రేక్షకులకు దగ్గరయ్యేలా సినిమాలు చేస్తున్నాడు. ఇక చాలా రోజుల తరువాత కిచ్చా సుదీప్ ఒక సరికొత్త ఫిట్నెస్ తో దర్శనమిచ్చాడు. త్వరలో పాంథమ్ అనే సినిమాతో రాబోతున్న సుదీప్ అందులో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం బాడీని ఈ విధంగా సిద్ధం చేశాడు. బ్యాక్ సైడ్ కండలు తిరిగేలా స్టిల్ ఇచ్చి అభిమానులకు మంచి కిక్కిచ్చాడు.

Kichcha Sudeep stunning look for his upcoming project

మంచి ఆహారం, డీసెంట్ లైఫ్ స్టైల్.. అలాగే క్రమశిక్షణ కూడా మనిషికి చాలా అవసరం అంటూ.. చాలా రోజుల తరువాత వర్కౌట్స్ స్టార్ట్ చేసినట్లు చెప్పాడు. పాంథమ్ సినిమాలోని క్లైమాక్స్ సీన్ కోసం స్పెషల్ గా ఈ వర్కౌట్స్ చేసినట్లు చెప్పిన సుదీప్ సినిమా యొక్క చివరి షెడ్యూల్ డిసెంబర్ 4న స్టార్ట్ కాబోతున్నట్లు చెప్పాడు. ఇక పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చివరగా పహిల్వాన్ సినిమాతో కన్నడలో హిట్ అందుకున్న సుదీప్ మిగతా భాషల్లో మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. మరి ఈ సారి ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X