కిక్ శ్యామ్ అరెస్ట్ వెనుక కొత్త ట్విస్టు.. స్టార్ హీరోలు, బడాబాబులు.. తీగ లాగుతున్న పోలీసులు

చట్ట వ్యతిరేకంగా గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నటుడు కిక్ శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమతులు లేకుండా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ఆయనను, మరో 13 మందిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో భారీ ముఠా ఉందని, పలువురు నటులు కూడా ఉన్నారనే కోణం మీడియాలో బయటకు వచ్చింది. ఈ కేసు గురించి చెన్నై పోలీసులు డొంక లాగుతున్నట్టు సమాచారం. ఈ కేసు గురించి బయటకు వచ్చిన ఆసక్తికరమైన విషయాలు..

Recommended Video

నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్ వెనుక కొత్త ట్విస్టు.. స్టార్ హీరోలు, బడాబాబులు..! || Oneindia Telugu
శ్యామ్ అపార్ట్‌మెంట్‌పై మెరుపుదాడులు

శ్యామ్ అపార్ట్‌మెంట్‌పై మెరుపుదాడులు

చట్టవ్యతిరేకంగా గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకొన్న చెన్నై పోలీసులు సోమవారం రాత్రి శ్యామ్ అపార్ట్‌మెంట్‌పై మెరుపు దాడులు నిర్వహించారు. ఆ ఇంటి నుంచి గేమ్ బోర్డులు, టోకేన్లు, లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకొన్నారు. వారిని అరెస్ట్ చేసి నుంగంబాకం F3 పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

రాత్రి 11 గంటల నుంచి 4 గంటల వరకు

రాత్రి 11 గంటల నుంచి 4 గంటల వరకు

పోలీసుల వెల్లడిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. శ్యామ్ ఇంటిని అడ్డాగా చేసుకొని జరుపుతున్న దందాలో పలువురు నటులు, వ్యాపారవేత్తలు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. గ్యాంబ్లింగ్ వ్యవహారాలను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిర్వహిస్తున్నారనే విషయం పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటకు వచ్చింది.

ఓ నటుడు 10 లక్షలు పోగొట్టుకోవడంతో

ఓ నటుడు 10 లక్షలు పోగొట్టుకోవడంతో

నటుడు కిక్ శ్యామ్ ఇంటిలో జరుగుతున్న గ్యాంబ్లింగ్ విషయాలు ఓ గొడవ కారణంగా బయటకు వచ్చింది. ఓ నటుడు కొద్ది రోజుల క్రితం రూ.10 లక్షలు పొగొట్టుకొన్నారు. దాంతో ఆయనకు ఇతరులకు గొడవ జరిగింది. ఆ గొడవ బయటకు పొక్కడంతో గందరగోళంగా మారింది. ఆ గొడవ పోలీసుల చెవిలో పడటంతో తీగ లాగారు. దాంతో ఈ దందా డొంక కదిలింది అని పోలీసులు పేర్కొంటున్నారు.

పలువురు స్టార్ నటులు, బాడా పారిశ్రామిక వేత్తలు

పలువురు స్టార్ నటులు, బాడా పారిశ్రామిక వేత్తలు

లాక్‌డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో సినిమా పరిశ్రమకు సంబంధించిన పలువురు నటులు, సాంకేతిక నిపుణులు గ్యాంబ్లింగ్ ఆటలకు ఆకర్షితులయ్యారు. ఇంకా చాలా మంది నటులు కూడా ఉన్నారు అని చెన్నై పోలీసులు తెలిపారు. గత రాత్రి అరెస్ట్ చేసిన వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. వారిపై సరైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తాం. ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంపై దర్యాప్తు లాగుతున్నాం అని చెన్నై పోలీసులు పేర్కొన్నారు.

కిక్ శ్యామ్ కెరీర్ ఇలా..

కిక్ శ్యామ్ కెరీర్ ఇలా..

కిక్ శ్యామ్ కెరీర్ విషయానికి వస్తే.. 12బీ చిత్రంతో కోలీవుడ్‌లోకి ప్రవేశించారు. కిక్, రేసు గుర్రం చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్యామ్ నటించిన పార్టీ అనే తమిళ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉంది. ఈ సినిమా విడుదల కోసం శామ్ వేచి ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X