Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరో శుభవార్త
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బ వరం శుభవార్త చెప్పారు. గతేడాది టాలీవుడ్ కిరణ్ అబ్బవరం తన సహానటి, హీరోయిన్ రహస్య గోరక్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ఈ ఇద్దరూ ఓ సినిమా కూడా కలిసి చేశారు. ఆ సమయంలోనే ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా కిరణ్ అబ్బవరం -రహస్య గోరక్ దంపతులు ఓ శుభవార్త ను తమ అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. దీపావళి సందర్భంగా విడుదలైన' క ' మూవీ తో భారీ సక్సెస్ ను అందుకున్నాడు. తన కెరీర్లో ఓ మైల్ స్టోన్ మూవీగా క మూవీ నిలిచిపోయింది. ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం దిల్ రూబా అనే కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.

గత ఏడాది హీరోయిన్ రహస్య గోరక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులు తమ అభిమానులకు తాము తల్లిదండ్రులు కాబోతున్నామని విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందులో ఇలా రాస్తూ..'నా ప్రేమ రెండు అడుగులు పెరిగింది. మేం ముగ్గురం కాబోతున్నాం' అంటూ తన భార్య తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు కిరణ్ అబ్బవరం.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సెలబ్రిటీ కపుల్ కు తమ బ్లెస్సింగ్స్ చెబుతూ చేస్తున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











