20 కోట్లతో పిరియాడిక్ మూవీ.. మరోసారి నిర్మాతగా మారిన కిరణ్ అబ్బవరం!
స్వయంకృషితో కిందిస్థాయి నుంచి యువ హీరోల్లో టాప్ స్థానంలో నిలిచిన యాక్టర్ కిరణ్ అబ్బవరం. విభిన్నమైన కంటెంట్, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఇమేజ్ ఏర్పరుచుకొన్నారు. హిట్టు, ఫ్లాప్ అనేది లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. అయితే తాజా ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్, ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా పిరియాడిక్ మూవీతో వచ్చేందుకు ప్లాన్ చేశారు. అయితే తాను సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గత రెండేళ్లుగా యమ స్పీడ్‌తో సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం.. పెళ్లి, ఇతర వ్యవహారాలతో కొంత బ్రేక్ తీసుకొన్నాడు. ప్రొఫెషనల్‌గా కూడా తన కెరీర్‌ను సరైన గాడిలో పెట్టేందుకు సమయం తీసుకొన్న ఆయన ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్‌కు తగినట్టుగా పీరియాడిక్ మూవీని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ మరింత అంచనాలు పెంచాడు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమాను శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకద్వయం సుజిత్, సందీప్ డైరెక్టర్స్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను కిరణ్ కెరీర్‌లోనే అత్యధికంగా బడ్జెట్‌తో అంటే సుమారుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.
ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్నది. ఈ మూవీని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ గానీ, అక్టోబర్‌లో గానీ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అత్యంత సాంకేతికత రూపొందుతున్న ఈ మూవీకి సీఎస్ సామ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టెక్నిషియన్స్, నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. అయితే ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుందనే ఆశాభావాన్ని టీమ్ వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











