ఫ్రీగా టికెట్లు ఇవ్వడానికి ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వస్తోంది.. కిరణ్ అబ్బవరం వీడియో వైరల్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో పైకొచ్చిన యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. అతను తన మొదటి సినిమా నుంచి కూడా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికితోడు అతను చేసే ప్రమోషన్స్ కూడా సినిమాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనే చెప్పాలి. డైరెక్ట్ గా జనాల్లోకి వెళుతూ సినిమాకు హైప్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా అతను తీసుకున్న ఒక నిర్ణయం తో ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వస్తోంది అనే విధంగా ఒక వీడియో విడుదల చేయడం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

సమ్మతమే రిలీజ్

సమ్మతమే రిలీజ్

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని కిరణ్ ప్రమోషన్స్ కూడా బాగానే చేశాడు. ఇక ఈ సినిమాకు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి మొదట పాజిటివ్ టాక్ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కూడా కిరణ్ ప్రమోషన్స్ లో కూడా తెలియజేశాడు.

అలాంటి వారి కోసం టికెట్లు

అలాంటి వారి కోసం టికెట్లు

అయితే రీసెంట్ గా కిరణ్ ఒక వీడియోను విడుదల చేస్తూ.. ఎవరైతే టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయని సినిమాని చూడలేని పరిస్థితి లో ఉన్నాము అని అనుకుంటున్నారో సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తే తప్పకుండా వారికి సమీపంలో ఉన్న థియేటర్లలో టిక్కెట్లు బుక్ చేస్తాను అని కూడా చెబుతూ ఒక ప్రత్యేకమైన వీడియో విడుదల చేశాడు.

 మరో వీడియోలో అసంతృప్తి

మరో వీడియోలో అసంతృప్తి

అయితే కిరణ్ అలా వీడియో విడుదల చేసాడో లేదో భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. అయితే ఆ ప్రభావం వలన అతను కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు గా వీడియో విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేను ఏదో 100 లేదు 1000 టికెట్లు ఇవ్వాలని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఇరవై వేలు టికెట్లు కావాలి అని తనను సంప్రదించారని చెప్పుకొచ్చాడు.

ఆస్తులు తాకట్టు

సినిమా విడుదల రోజు రాత్రి నుంచి కూడా టికెట్లు బుక్ చేయడంతోనే సరిపోతుంది అని.. అయితే ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నా క్రమంలో తన ఫోన్లో ఉన్న డబ్బులు కూడా సరిపోవు అని అందుకే ఆస్తులను తాకట్టు పెట్టే వరకు విషయం వచ్చినట్లుగా అందులో తెలియజేశాడు.

Recommended Video

Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
 బైక్ లో పెట్రోల్ కావాలంట..

బైక్ లో పెట్రోల్ కావాలంట..

అయితే టికెట్ల కోసం అభ్యర్థిస్తున్న వాటిలో కొన్ని సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లు కూడా ఉన్నట్లుగా అనిపిస్తోంది అని హీరో వివరణ ఇచ్చాడు. కొందరు సోషల్ మీడియాలో టికెట్స్ అడుగుతున్న విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని ఒక వ్యక్తి అయితే ఏకంగా తనకు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కు టికెట్స్ కావాలి అని అంతేకాకుండా బైక్ లో పెట్రోల్ కోసం కూడా వంద రూపాయలు కావాలి అడుగుతున్నట్లు కిరణ్ తెలియజేశాడు. కిరణ్ ఒక విధంగా కొంతమందికి నిజంగా నా టికెట్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరికైనా పంపకపోతే మాత్రం క్షమించాలి అని కూడా ఆ వీడియోలో అతను తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X