Klin Kaara Birth Day: పెళ్లి జరిగి 11 ఏళ్లైనా సంతానం లేదా? వేధించిన ప్రశ్నలు.. రాంచరణ్ ఎమోషనల్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ . డ్యాన్స్, ఫైట్లు, నటన, డైలాగ్ డెలివరీ ఇలా ఏ విషయంలోనైనా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు చెర్రీ. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా తండ్రికి మించిన ఇమేజ్‌ను, పాపులారిటీని సంపాదించుకున్నారు చరణ్. తన తోటి స్టార్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్న సమయంలోనే చరణ్ తన స్నేహితురాలు, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనా కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012 జూన్ 14న చరణ్ - ఉపాసన వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
అయితే పెళ్లయిన జంటను ఎవరైనా తరచుగా అడిగే కామన్ క్వశ్చన్ విశేషం ఏమైనా ఉందా అని . ఇదే ప్రశ్న చరణ్ - ఉపాసనలకు ప్రారంభంలోనే ఎదురైంది. పైగా సెలబ్రెటీ కపుల్ , చిరంజీవి ఇంటి వ్యవహారం కావడంతో సహజంగానే వీరిపై ఫోకస్ ఎక్కువగా ఉండేది. చరణ్, ఉపాసన పాల్గొనే ఇంటర్వ్యూలు ఈ ప్రశ్న లేకుండా ముగిసేవే కాదు. అలా రోజులు గడిచిపోతూ.. పదేళ్ల కాలం గిర్రున తిరిగింది. అప్పటికీ కూడా చరణ్ దంపతులు శుభవార్త ఎప్పుడు చెబుతారా అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు.

చరణ్ సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉండగా.. ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలు చూసుకునేవారు. అయినప్పటికీ తీరిక వేళలలో భార్యాభర్తలిద్దరూ టైం స్పెండ్ చేసేవారు. అయినా వారు పిల్లల్ని ఎందుకు కనడం లేదు అనే ప్రశ్న తరచుగా ఎదురవుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ సందర్భంలో పెళ్లి, పిల్లలు తదితర అంశాలపై ఉపాసన కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని కనడమేనది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని తేల్చిచెప్పారు.
అయితే అందరి ఆశలు ఫలించి 2022 డిసెంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు చెర్రీ , ఉపాసన అధికారికంగా తెలియజేశారు. అదే ఏడాది జూన్ 20న హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు, సన్నిహితులు సంబరాలు జరుపుకున్నారు. ఈ పాపకు ఆది పరాశక్తి ..లలితా సహస్ర నామాల్లో ఒకటైన 'క్లిన్‌కారా' అనే పేరును పెట్టారు. ఆ బిడ్డ జన్మించిన వేళా విశేషమో ఏమో కానీ మెగా ఫ్యామిలీలో అన్ని శుభ శకునాలే. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం, చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడం ఇలా క్లిన్‌కారా మెగా ఫ్యామిలీకి లక్కీ గర్ల్‌గా మారిపోయారు.

ఇవాళ క్లిన్‌కారా ఫస్ట్ బర్త్ డే .. దీంతో మెగాభిమానులు, సన్నిహితులు కుటుంబ సభ్యులు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన ఓ స్పెషల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. క్లిన్‌కారా పుట్టినప్పుడు కుటుంబ సభ్యులు ఎంత సంతోషించారో వివరిస్తూ, డెలివరి సమయంలో ఈ వీడియోను తీశారు. ఈ వీడియోలో చరణ్- ఉపాసన ఇద్దరూ ప్రెగ్నెన్నీ నుంచి బేబీ పుట్టేంత వరకు ఎలా ఫీల్ అయ్యారో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
పెళ్లయిన తర్వాత అంతా తమని పిల్లల గురించి అడిగేవాళ్లని, పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత పాప పుట్టడం సంతోషంగా ఉందన్నారు. ఫస్ట్ టైం పాపను ఎత్తుకున్నప్పుడు, అభిమానులు ఎలా సంబరాలు చేసుకున్నారో చెబుతూ కంటతడి పెట్టారు చరణ్ దంపతులు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











