twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy birthday suriya: మనసున్న నిజమైన కథానాయకుడు.. అందుకే జ్యోతిక పడిపోయింది!

    |

    సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు కావాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నా కూడా అదృష్టం ఒక శాతం అయినా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ అందరూ అనుకున్నట్లు రంగుల ప్రపంచంలో క్లిక్కవ్వలేరు. అయితే కోలీవుడ్ సూర్య ముందు ఒక మంచి నటుడు అనే మాట కంటే కూడా మంచి మనసున్న మనిషి అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా మంది అభిమానులు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు.

    సూర్య చేయని ప్రయోగం లేదు..

    సూర్య చేయని ప్రయోగం లేదు..

    నటుడిగా సూర్య చేయని ప్రయోగం లేదు. ఇక దాదాపు అన్ని జానర్స్ ని టచ్ చేశాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ గా స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా సూర్య స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ని హైలెట్ చేస్తూ ఉంటాడు. సినిమా అనేది విజ్ఞానాన్ని కూడా ఇవ్వాలని మంచి కథలను ఎంచుకుంటూ ఉంటాడు.

    1997లోనే మొదటి సక్సెస్..

    1997లోనే మొదటి సక్సెస్..

    1997 నెరుక్కు నేర్ అనే సినిమా ద్వారా సూర్య సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అందులో విజయ్ మెయిన్ హీరో అయినా సూర్యకి మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత బాలా దర్శకత్వంలో వచ్చిన నంద సినిమాతో సోలో హీరోగా అసలైన సక్సెస్ అందుకున్నాడు. అనంతరం శివ పుత్రుడు, పెరజగన్ అనే సినిమాలతో తనలోని అసలైన నటుడిని బయట పెట్టాడు.

    తెలుగులో కూడా..

    తెలుగులో కూడా..

    గజిని, విడోక్కడే, ఘటికుడు, సింగం వంటి సినిమాలతో తెలుగులో కూడా తన మార్కెట్ ని పెంచుకున్నాడు. దాదాపు టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందుకునే బాక్సాఫీస్ కలెక్షన్స్ సూర్య ఈజీగా అందుకునే స్థాయికి వచ్చాడు. ఒక విధంగా రజినీకాంత్ తరువాత తెలుగులో అత్యంత మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరని చెప్పవచ్చు. సూర్య సినిమాలతొ కాకుండా సామాజిక అంశాలతో కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

    Recommended Video

    Hero Surya Grand Entry In Tollywood
    రియల్ హీరో..

    రియల్ హీరో..

    ఒక విదంగా జ్యోతిక ఆయనను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అదే. ఇప్పటివరకు సూర్య చాలా మంది అనాధాలను చదివించాడు. తన ఆరంగం ఫౌండేషన్ ద్వారా వందలాది మంది ఆడపిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. వాళ్ళు ఎంత చదువుకుంటే అంత వరకు సొంత ఖర్చులతో సూర్య చదివిస్తూ ఉన్నాడు. ఈ విదంగా రియల్ లైఫ్ లో కూడా సూర్య రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

    English summary
    Needless to say, the story of the talented Tamil hero Surya's choice. His film will have something to do with the future. Needless to say, things like Seventh Sense Virus, Bundobast Locust Attack, etc., have gone viral. Looks like Next Time is preparing for another time travel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X