సినిమా కోసం విక్రమ్ మరో సాహసం.. కొంచెమైతే ప్రాణాలు నీళ్లల్లో కలిసిపోయేవి!

సినిమా స్టార్స్ అంటే ఫ్యాషన్ లైఫ్, కాస్ట్లీ జీవితం అని అందరూ కామెంట్ చేస్తుంటారు. అయితే ఒక స్టార్ హీరోగా ఎదగడానికి ఒక నటుడిగా ఎంత కష్టపడుతుంటారు అనేది ఎవరికి తెలియదు. ఒక యాక్షన్ సినిమా అద్భుతంగా వచ్చింది అంటే అందులో హీరోల పాత్ర కూడా చాలానే ఉంటుంది. ఇక విక్రమ్ లాంటి హీరో కూడా అప్పుడప్పుడు తన ప్రాణాలను రిస్క్ లో పెడుతుంటాడు. రీసెంట్ గా మరోసారి ఈ టాలెంటెడ్ యాక్టర్ అలాంటి సాహసమే ఒకటి చేశాడట.

 యాక్టింగ్ కోసం..

యాక్టింగ్ కోసం..

ఇండియా మొత్తంలో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అద్భుతమైన నటనతో మెప్పించే వారు మాత్రం కొంత మందే ఉంటారు. అలాంటి వారిలో విక్రమ్ ఒకడు. సినిమా ఎలాంటిదైనా సరే విక్రమ్ తన పాత్ర హైలెట్ అయ్యేలా నటించే తీరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఎలాంటి పాత్ర చేసినా కూడా తనదైన శైలిలో పాత్రకు ప్రాణం పోస్తుంటాడు.

మరోసారి..

మరోసారి..

ఒక దర్శకుడు ప్రయోగాత్మకమైన కథను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ముందుగా ఆ కథకు విక్రమ్ లాంటి హీరో అయితే ఎలా ఉంటుంది.. అనే ఆలోచిస్తాడు. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా విక్రమ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఈ హీరో ఒక వాటర్ సీన్ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టేశాడు.

కోబ్రా సినిమాలో..

కోబ్రా సినిమాలో..

శంకర్ ఐ సినిమా కోసం ఒక్కసారిగా బరువు తగ్గి షాకిచ్చిన విక్రమ్ ఆ తరువాత మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయలేదు. గతంలో అపరిచితుడు సినిమాలో కూడా విక్రమ్ కొన్ని సాహసాలు చేశాడు. వాటర్ లో కొంత సేపటి వరకు ఎమోషనల్ గా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక యాక్షన్ సీన్ కోసం కూడా కొంత సేపటి వరకు విక్రమ్ వాటర్ లోనే ఉన్నాడట.

Recommended Video

Pooja Kumar Revealed The Relation With Kamal Haasan
 షాకైనా దర్శకుడు..

షాకైనా దర్శకుడు..

కోబ్రా చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ సాహసం గురించి చెప్పాడు. ఒక సన్నివేశంలో చేతులు కాళ్ళు కట్టేసి నోటికి కూడా బట్టతో కట్టి ఉంటుంది. అప్పుడు తలకిందులుగా వాటర్ లోకి పంపిన సన్నివేశంలో విక్రమ్ డూప్ కొన్ని సెకన్ల పాటే ఉండగలిగాడు. కానీ విక్రమ్ మాత్రం డూప్ తో అవసరం లేదని కొన్ని నిమిషాల పాటు నీటిలోనే ఉన్నాడట. కొంచెం ఆలస్యం అయినా అది ప్రాణాలకు ప్రమాధమేనని దర్శకుడు విక్రమ్ గురించి వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X