Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హైదరాబాద్ రోడ్డుపై చాయ్ తాగుతూ కనిపించిన స్టార్ హీరో.. సైకిల్ పైనే ప్రయాణం..
కోలీవుడ్ సినిమా ప్రపంచంలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నారో దాదాపు అందరికి ఒకే రకమైన హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్స్ తరువాత అత్యదిక ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోల్లో అజిత్ ఒకరు. ఈ స్టార్ హీరో కమర్షియల్ సినిమాలతోనే అభిమానులకు నచ్చే విధంగా వెండితెర విందు భోజనాన్ని అందిస్తుంటాడు. అయితే ఈ హీరోకు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉన్నాయి. మొన్న బైక్ నడుపుకుంటు ఏకంగా వేల కిలోమీటర్లు దాటుకుంటూ వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు సైకిల్ పైనే హైదరాబాద్ ను చుట్టేశాడు.
అత్యదిక మాస్ ఫాలోయింగ్..
కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక మాస్ ఫాలోయింగ్ ను సెట్ చేసుకుంటున్న అజిత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వంద కోట్లకు తక్కువ రాబట్టవు. గత 5 సినిమాలు కూడా వరుసగా వంద కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకొని న్యూ రికార్డ్ క్రియేట్ చేశాయి. వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండే అజిత్ కనీసం అభిమానులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే పనులు చేయనివ్వడు.
వందల కిలో మీటర్ల ప్రయాణం..
పర్సనల్ లైఫ్ తో అజిత్ చాలా బిజీగా ఉంటాడు. ఇక ఈ హీరోకు బైకుల పిచ్చి చాలా ఎక్కువ. కొన్నిసార్లు షూటింగ్స్ కు బైక్ పైన కూడా వస్తుంటాడు. లొకేషన్స్ వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా కూడా లెక్క చేయడు. ఒకసారైతే హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చి సినిమాలో వాడిన బైక్ పైనే చెన్నైకు వెళ్లిపోయాడు. అజిత్ కు బైక్ నచ్చింది అంటే అస్సలు వదిలిపెట్టడు.
రోడ్డుపై చాయ్ తాగుతూ..
కొన్ని రోజుల రోజుల క్రితం అజిత్ ఒక లాంగ్ టూర్ వేశాడు. బైక్ రేసులో పాల్గొన్న అనుభవం కూడా ఉన్న అజిత్ చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తుంటారు. అయితే రీసెంట్ గా తన బీఎండబ్ల్యూ బైక్ పై వారాణసిని టార్గెట్ చేశాడు. చెన్నై నుంచి వారణాసి వెళ్లిన అజిత్ అనంతరం అక్కడి నుంచి సిక్కిం వెళ్లనున్నాడు. ఆ ప్రయాణం అనంతరం హైదరాబాద్ కు వచ్చిన అజిత్ సైకిల్ పై హైదరాబాద్ చుట్టేశాడు. ఒక కేఫ్ దగ్గర చాయ్ తాగుతూ కనిపించాడు.
స్నేహితులతో సైకిలింగ్..
ఫొటోలు బయటకు రాగానే అజిత్ ఎక్కడ తిరుగుతున్నారు అనే దానిపై అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే.. ఫైనల్ గా అజిత్ కు సంబంధించిన మరిన్ని ఫొటోలు బయట పడడంతో అతను హైదరాబాద్ ఏండింగ్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అజిత్ తో పాటు అతని స్నేహితులు కూడా కొంతమంది సైకిలింగ్ చేస్తున్నారు.
అజిత్ న్యూ రికార్డ్
రీసెంట్ గా వారణాసికి బైక్ పై వెళ్లిన అజిత్ ఒక అభిమానితో కూడా ఫొటో దిగాడు. ఆ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడు రోడ్ ట్రిప్ లో మొత్తంగా అజిత్ 4500 కిలోమీటర్లు ప్రయాణం చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ హీరో H వినోథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వలిమై అనే ఆ సినిమా ఈ ఏడాది ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.