విజయ్ కి రికార్డు రెమ్యునరేషన్.. ప్రభాస్, రజినికి మించి.. ఎన్ని కోట్లు అంటే?
Vijay Remuneration: తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు కోలీవుడ్ లోనే కాగా.. పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన స్టార్ ఇమేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. తాజాగా తలపతి విజయ్ 'గోట్' (GOAT)మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్ వింటే కచ్చితంగా దిమ్మతిరగాల్సిందే. కండ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆ సినిమా బడ్జెట్ లో సగం ఆయన రెమ్యూరేషనేనంట. ఇంతకీ ఎన్ని కోట్లు తీసుకున్నారో మీరు కూడా తెలుసుకోండి.
గతేడాది దళపతి విజయ్ నటించిన లియో మూవీ తో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడంతో కోలివుడ్ టాప్ హీరో గా మారారు. దీంతో విజయ్ దళపతి తాజాగా నటిస్తున్న చిత్రం గోట్. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ మూవీలో విజయ్ డూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్డెట్ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో టీం యూనిట్ శరవేగంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

అయితే.. గత కొద్ది రోజులుగా విజయ్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని
దాదాపు 300-400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారట. ఈ మూవీలో నటించడానికి విజయ్ ఏకంగా రూ.150 కోట్లు పారితోషకం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే.. ప్రచారానికి నిర్మాత అర్చన కల్పాతి చెక్ పెట్టారు. 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'లో విజయ్ నటించడానికి రూ. 200 కోట్ల పారితోషికం తీసుకున్నారని, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా విజయ్ నిలిచారని నిర్మాత అర్చన కల్పాతి వెల్లడించారు.
ఇప్పటివరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోలుగా సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ప్రభాస్ పేర్లు వినిపించేవి. వీరిద్దరూ రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. కానీ దళపతి విజయ్ గోట్ మూవీలో నటించడానికి ఏకంగా రూ. 200 కోట్ల పారితోషికం తీసుకున్నారని, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా విజయ్ నిలిచారు. ఇప్పటివరకు ప్రభాస్ రూ.150 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ .125 కోట్లు మాత్రమే రెమ్యూరేషన్ తీసుకున్నట్టు తెలుసు. కానీ, విజయ్ ఒక్కసారిగా రెట్టింపు స్థాయిలో పారితోషకం తీసుకోవడంతో షాక్ గురవుతున్నారు.

గత ఏడాది ఆయన నటించిన లియో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీ రూ. 200 కోట్ల మార్కును దాటిన ఏడవ చిత్రంగా నిలిచింది. అతని గత ఏడు చిత్రాలు ఏకంగా రూ. 2000 కోట్లకు పైగా వసూలు చేశాయి. అలాగే.. ఆగస్ట్ 17న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన తమిళ సినిమా ట్రైలర్‌గా 33 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications











