ఫ్యాన్స్ దెబ్బకు భయపడిన విజయ్.. కొంచమైతే ఆ లక్ష మంది కొంపముంచే వాళ్ళు!
అభిమాని లేనిదే హీరోలు లేరనే మాట వాస్తవమే అయినప్పటికీ కొన్నిసార్లు ఆ అభిమానం డోస్ హీరోలను చాలా ఇబ్బందికి గురి చేస్తుంటుంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు ఏ రేంజ్ లో జరుగుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరోలు కూడా ఫ్యాన్స్ కి చెప్పి చెప్పి విసిగిపోతున్నారు. ఇకపోతే రీసెంట్ గా కోలీవుడ్ హీరో విజయ్ అభిమానులు సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు. కరోనా టైంలో అలాంటి సర్‌ప్రైజ్ ఎవరు ఊహించి ఉండరు. వారు వేసిన ప్లాన్ కి విజయ్ భయపడి పోయాడట.

విజయ్ కోసం..
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల ఎంత మంది ఉన్నా కూడా అందులో విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న విజయ్ కోసం అభిమానుకు ఎందాకైనా వస్తారని మొన్న జరిగిన ఒక ఘటన ఉదాహరణగా నిలిచింది. విజయ్ ని ఐటి అధికారులు విచారించారని లక్షలాది మంది ఆయన ఉన్న షూటింగ్ లొకేషన్స్ కి వచ్చారు.

బర్త్ డే ప్లాన్స్..
మాస్టర్ షూటింగ్ సమయంలో ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక నెక్స్ట్ విజయ్ పుట్టినరోజు రాబోతోంది. ఈ నెల 22న పుట్టినరోజు కావడంతో అభిమానులు కొన్ని స్పెషల్ ప్లాన్స్ వేసుకున్నారు. లక్షలాది మంది ఫ్యాన్స్ హీరోకు మంచి సర్‌ప్రైజ్ కూడా ఇవ్వాలని అనుకున్నారట.

భయపడిన విజయ్..
ప్రతి ఏరియాలో అభిమానులు విజయ్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకొని వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. విజయ్ మాత్రం దెబ్బకు భయపడి పోయాడు. ఎంతకైనా మంచిది అని పది రోజుల ముందు నుంచే అభిమానులను కంట్రోల్ చేస్తున్నాడు.
Recommended Video

ముందుజాగ్రత్తగా..
ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ ల సంఖ్య భారీగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులలో ఈ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. అయినప్పటికీ జనాలు రూల్స్ పాటించడం లేదు. ఇక లక్షలాది మంది అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారని విన్న విజయ్ వెంటనే వారికి హెచ్చరికలు జారీ చేసి ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని అన్నాడు. అలాగే ఫ్లెక్సీలు కట్టవద్దని ఆ డబ్బుతో పేద ప్రజలకు సహాయం చేస్తే అదే తనకు మంచి గిఫ్ట్ అని తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











