ఇన్‌స్టాగ్రామ్ రికార్డ్ బద్దలు కొట్టేలా విజయ్ ఎంట్రీ.. కానీ బన్నీ, దేవరకొండ కంటే తక్కువే..
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటున్న హీరోలలో విజయ్ ఒకరు. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న విజయ్ బాక్సాఫీస్ పరంగా కూడా అందరిని మించి పోతున్నాడు. ఇప్పుడు అతను సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో టాప్ లిస్టులో ఉన్నాడు అని చెప్పవచ్చు.
విజయ్ రానున్న రోజుల్లో పాన్ ఇండియా హీరోగా కూడా చక్రం తిప్పే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోవర్స్ ఆ రేంజ్ లో పెరుగుతున్నారు. ఇటీవల వారసుడు సినిమాతో కూడా తెలుగులో మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ ను గట్టిగా పెంచుకుంటున్నాడు. ఇక అతను ఇన్ స్టాగ్రామ్ లో రీసెంట్గా ఎంట్రీ ఇచ్చాడు.

విజయ్ ఎంట్రీ ఇచ్చి ఒక ఫోటో పోస్ట్ చేయగానే ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇక అత్యధిక స్థాయిలో వేగంగా 1 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్న లిస్టులో విజయ్ ఉన్నాడు. ఇప్పటికే అతని ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్స్ వరకు చేరుకుంది. అయితే మొదటి ఫోటో పోస్ట్ చేయగానే ఊహించని స్థాయిలో అయితే రెస్పాన్స్ వచ్చింది.
కానీ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కంటే తక్కువ స్థాయిలోనే లైక్స్ వచ్చాయి. మొదట కేజీఎఫ్ స్టార్ యష్ తన ఫ్యామిలీ ఫోటో ద్వారా ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టాడు. ఇక 49 నిమిషాల్లోనే ఆ ఫోటోకి 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇక తర్వాత అల్లు అర్జున్ తన మొదటి ఫోటోకు 69 నిమిషాల్లో వన్ మిలియన్ లైక్స్ అందుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ 94 నిమిషాల్లో తన మొదటి ఫోటోకి 1 మిలియన్ లైక్స్ అందుకోగా ఇప్పుడు విజయ్ అయితే లియో లుక్ తో 104 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ సాధించాడు. ఇక రాబోయే రోజుల్లో విజయ్ సోషల్ మీడియా ప్రపంచంలో ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తాడని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











