మెగాస్టార్ చిరు డ్యూయెల్ రోల్ కథ.. కొరటాల ఇంకా ఫినిష్ చేయలేదా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సైరా చిత్రం తరువాత కొరటాల దర్శత్వంలో చిరు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథని పూర్తిచేసే పనిలో దర్శకుడు ఉన్నాడని, ఈ ఏడాదే ఈ చిత్రం ప్రారంభం అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి.

పూర్తికాని కథ
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర కథని కొరటాల ఇంకా పూర్తి చేయలేదట. అభిమానులు మెగాస్టార్ సినిమా నుంచి ఆశించే వినోదాత్మక అంశాలతో పాటు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా కొరటాల కథ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

డ్యూయెల్ రోల్
చిరంజీవి ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నాడని, అది కూడా రైతు పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు కొరటాల శివకు పరాజయమే లేదు. దీనితో మెగాస్టార్ తో రూపొందించబోయే చిత్రంపై ఇంతలా ఆసక్తి నెలకొనిఉంది.

సంక్రాంతికి తరువాతే
కొరటాల శివ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో పూర్తి కథ సిద్ధం చేయమని చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండడంతో ఈ చిత్ర ప్రారంభం సంక్రాంతి తరువాతే అని ప్రచారం జరుగుతోంది. అప్పటికి సైరా చిత్రం కూడా దాదాపుగా పూర్తి అవుతుంది.

రాంచరణ్ నిర్మాణంలోనేనా
ఈ చిత్రాన్ని కూడా రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడని ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఇందులో మరో నిర్మాత భాగస్వామిగా ఉంటాడని అంటున్నాడు. ఈ విషయాలన్నింటికీ క్లారిటీ రావాలంటే ముందు ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాలి.


Click it and Unblock the Notifications











