NTR 30: ఆ బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ బిగ్గెస్ట్ ప్లాన్.. భారీ ఖర్చుతో నెవ్వర్ బిఫోర్ సెట్!

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. RRR తరువాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఈ మూవీ విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు. కచ్చితంగా ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా తారక్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఈ నేపధ్యంలో మరోసారి ఈ సినిమాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని తారక్ అనుకుంటున్నాడు.

అందుకోసమే స్క్రిప్ట్ విషయంలో చిన్న చిన్న లూప్స్ కి కూడా అవకాశం ఇవ్వకుండా తారక్ కొరటాలతో పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందట. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ సినిమాని కొరటాల తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మార్చి 20 తర్వాత మొదలవుతుందని అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ క్లారిటీ ఇచ్చేశాడు.

Koratala siva biggest island set for Jr ntr 30 project never before plan

ఇక ఈ నెల ఆఖరులో ప్రారంబోత్సవం జరుగుతుందని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాని పూర్తిగా ఫిక్షనల్ కాన్సెప్ట్ తోనే కొరటాల సిద్ధం చేసాడని టాక్. దీనికోసం ఒక ఐలాండ్ ని కూడా సృష్టిస్తున్నారని తెలుస్తుంది. అలాగే పోర్ట్ ఫిక్షనల్ పోర్ట్ కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం. ఈ ఐలాండ్, పోర్ట్ సెట్ ని హైదరాబాద్ లోనే సాబు సిరిల్ సిద్ధం చేస్తున్నారు.

ఇక మూవీ కథ నేపధ్యం అంతా ఆ ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని తెలుస్తుంది. ఇక మూవీ షూటింగ్ మొత్తం హైదరాబాద్, విశాఖపట్నం, గోవాలో ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. అలాగే పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాకి సంబందించిన సన్నివేశాలు ఉంటాయని టాక్. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా సరికొత్త ప్రపంచాన్ని ఈ మూవీ కోసం కొరటాల సృష్టించినట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X