NTR 30 విలన్ కోసం కొరటాల శివ మొండిపట్టు.. లిస్టులో ఇద్దరు తమిళ స్టార్స్.. మరో బాలీవుడ్ హీరో?

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం మరింత బలంగా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలు కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా పాత్ర కోసం కొంతమంది ప్రముఖ సినీ తారలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బ్యాడ్ సెంటిమెంట్.. కసిగా ఉన్న ఎన్టీఆర్

బ్యాడ్ సెంటిమెంట్.. కసిగా ఉన్న ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ ను ఒక బ్యాడ్ సెంటిమెంట్ అయితే ఇప్పుడు వెంటాడుతోంది. రాజమౌళితో ఎలాంటి సినిమా తీసినా కూడా ఏ హీరో అయినా సరే ఆ తర్వాత మరొక దర్శకుడితో అయితే ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొంటున్నారు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలి అని ఎన్టీఆర్ చాలా కసిగా కనిపిస్తున్నాడు. అందుకే కొరటాల శివ ప్రాజెక్టు ఫైనల్ స్క్రిప్ట్ మొత్తం వచ్చేవరకు కూడా ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావడం లేదు.

అప్డేట్ తో ఎన్టీఆర్ అసహనం

అప్డేట్ తో ఎన్టీఆర్ అసహనం

ఇక మొత్తానికి అయితే ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇటీవల ఎన్టీఆర్ అమిగోస్ సినిమా ఈవెంట్లో తెలియజేసిన విషయం తెలిసిందే. అప్డేట్స్ సరైన సమయంలో ఇస్తామంటూ కొంత ఫాన్స్ ఒత్తిడి పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది అని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి త్వరగానే ఈ సినిమా విడుదలవుతుంది అని కూడా తెలియజేశారు.

ఊహించని బ్యాక్ డ్రాప్

ఊహించని బ్యాక్ డ్రాప్

ఇక ఎన్టీఆర్ 31వ ప్రాజెక్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాలు కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమా ఒక పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది అని ఒక ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ ను ఎదుర్కొనే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అని అంటున్నారు. అంతేకాకుండా భారీ ఐలాండ్ ను కూడా ప్రత్యేకంగా సెట్స్ లో చూపించబోతున్నట్లు సమాచారం.

విలన్ కోసం తమిళ స్టార్స్?

విలన్ కోసం తమిళ స్టార్స్?

అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రముఖ నటీనటులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీలో నుంచి ఇదివరకే విశాల్ పేరు వినిపించింది. ఇక ఇప్పుడు విక్రమ్ తో పాటు విజయ్ సేతుపతి పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి పైనే కొరటాల శివ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు సమాచారం.

ఆ బాలీవుడ్ స్టార్ పేరు కూడా..

ఆ బాలీవుడ్ స్టార్ పేరు కూడా..

అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో నుంచి కూడా ఒక ప్రముఖ స్టార్ ను ఇందులో కీలక పాత్ర కోసం అడుగుతున్నట్లు ఒక టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఇప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా ఒక గాసిప్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఫైనల్ గా పూర్తి చిత్ర యూనిట్ సభ్యులపై కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X