పవన్ మాటలకు కన్నీళ్లు ఆగలేదు.. జీవితంలో అదే మొదటిసారి.. ఎమోషనల్ అయిన కోటా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏపీలో రాజకీయాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆయన మరో నాలుగు సినిమాలకు ఓకే చెప్పారు, అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు స్క్రిప్ట్ పూర్తి చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆయన గురించి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఆ సినిమా చేస్తునప్పుడే ఆయన మరో నాలుగు సినిమాలు ఒప్పుకున్నారు. అందులో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ దశలో ఉంది, .

నాలుగు సినిమాలు
అలాగే నాగ వంశీ నిర్మాణంలో అయ్యప్పనుమ్ కోశియం రీమేక్ అయిన భీమ్లా నాయక్ కూడా షూటింగ్ చివరి దశలో ఉంది ఈ సినిమాకి సాగర్ కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మరో సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఓకే చేశారు.

కోటా ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ సంగతి అలా ఉంచితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి కోటా శ్రీనివాస రావ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన. అందులో భాగంగానే ఆయన పవన్ తో ఉన్న జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకున్నాను.

పవన్ తో ఉన్న జ్ఞాపకాన్ని
అత్తారింటికి దారేది' సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగితే దానికి దాదాపు యూనిట్ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యామన్న ఆయన ఆ వేడుకలో పవనకల్యాణ్‌గారు ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడి నా వరకు వచ్చేసరికి ''కోట గారు పెద్దవారు, ఆయన గురించి నేనేమని చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు గాని, అనుభవం కానీ సరిపోదు'' అన్నారని పేర్కొన్నారు.
Recommended Video

నాకు గొప్పగానే
అవి విని ఫస్ట్‌టైమ్ ఒక వేదిక మీద నాకు కళ్ళు చెమర్చడం జరిగిందన్నారు. ఒక అరనిమిషం నా కళ్ళ నుండి నీళ్ళు కారాయనీ, హాల్లో జనాలందరూ 'పవర్‌స్టార్ పవర్‌స్టార్' అని కేకలు పెడుతుంటే, ఆ పవర్‌స్టారే నా గురించి రెండు మాటలు గౌరవంగా చెప్పడం నాకు గొప్పగానే అనిపించిందన్నారు. ఇక అదే వేదికమీద త్రివిక్రమ్ మాట్లాడుతూ ''నాకు ఇష్టమైన నటుడు కోట శ్రీనివాస రావు గారు'' అన్నారని అది కూడా చాలా బాగా అనిపించిందని అన్నారు.


Click it and Unblock the Notifications