ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం.. ఆయనను బీట్ చేసే నటుడు తెలుగులో లేడు.. కోటా ప్రశంసల వర్షం

అచ్చ తెలుగు విలన్ అంటే గుర్తుకు వచ్చే కోట శ్రీనివాసరావు. అయితే వయసు పైబడటంతో ప్రస్తుతానికి ఇంటికే పరిమితం అయ్యారు. అడపా దడపా దక్కినా ఆయనకు చాలా చిన్న పాత్రలు మాత్రమే దక్కుతున్నాయి. కరోనా తర్వాత ఆయన పూర్తి స్థాయిలో బయటకు రావడమే మానేశారు అంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఆ కామెంట్స్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

పేరు రాదని

పేరు రాదని

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన కోట శ్రీనివాసరావు రాజమౌళితో సినిమాలు చేసే చేస్తున్న హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి సినిమాలు అద్భుతంగా ఆడతాయని, కానీ ఆయన సినిమాలో చేసే ఏ ఆర్టిస్ట్ కి పేరు రాదని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. అయితే అలా ఎందుకు జరుగుతుందనే విషయం మీద కూడా తన దగ్గర సమాధానం లేదని చెబుతూనే ఒక ఉదాహరణ చెప్పారు.

బ్రాండ్ వచ్చిందని

బ్రాండ్ వచ్చిందని

గతంలో నిర్మాత రామానాయుడుతో సినిమాలు చేసేవారు ఏ డైరెక్టర్ తో సినిమాలు చేస్తున్నారని అడిగితే నాయుడు గారి సినిమాలో చేస్తున్నామని చెప్పుకునే వారిని అలాగే రాజమౌళి కూడా ఆ బ్రాండ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అంటే రామానాయుడుతో సినిమా చేస్తున్న దర్శకులకు ఎలా అయితే పేరు రాదో, రాజమౌళి సినిమాలో నటిస్తున్న నటీనటులకు కూడా పెద్దగా విలువ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ దిట్ట

ఎన్టీఆర్ దిట్ట

ఇదే సందర్భంలో ఆయన ఎన్టీఆర్ గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ లు ఉన్నా అందరిలోనూ ది బెస్ట్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి రసాన్ని పండించడంలో ఎన్టీఆర్ దిట్ట అని పేర్కొన్న ఆయన ఆయనను బీట్ చేయగల నటుడు తెలుగు సినీ పరిశ్రమలో లేరన్నారు.

మండిపడుతున్నారు

మండిపడుతున్నారు

ఎమోషన్స్ ని పండించే వారిలో మహేష్ బాబు అల్లు అర్జున్ ఉన్నా సరే వారిని మించి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుందని అందుకే ఆయన లాంటి నటుడు తెలుగులో మరెవరూ లేరని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు రామ్ చరణ్ నటన బాగోదు అని చెప్పడంతో రామ్ చరణ్ అభిమానులు ఆయన మీద మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్


అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయం గురించి చేయబోతున్న సహాయం గురించి కూడా కోట శ్రీనివాసరావు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన మీద మెగా అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు అంటూ ప్రశంసలు కురిపించడంతో నందమూరి అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఇక కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం మీద మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X