For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంపూర్ణేశ్ బాబుతో బడా దర్శక నిర్మాతలు.. మాజీ సీఎం బయోపిక్ తర్వాత ఇదే.!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి సినిమాతోనే హాట్ టాపిక్ అయిన వారిలో సంపూర్ణేష్ బాబు ఒకరు. ఆయన 'హృదయ కాలేయం' అనే సినిమా టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. ఆకట్టుకునే అందం, సరైన ఫిజిక్ లేకపోయినా సంపూకి తెలుగు రాష్ట్రాల్లో బానే క్రేజ్ ఉంది. హృదయ కాలేయం తర్వాత కూడా సంపూ 'బందిపోటు', 'పెసరట్టు' అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఇవేమీ ఆయనకు బ్రేక్ ఇవ్వలేదు. కానీ, ఇటీవల వచ్చిన 'కొబ్బరిమట్ట'తో ఆయన దశ మారిపోయింది. దీంతో అతడికి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి.

  కొబ్బరి మట్ట భారీ సక్సెస్

  కొబ్బరి మట్ట భారీ సక్సెస్


  ఇటీవల ‘కొబ్బరి మట్ట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్లను కూడా అదే స్థాయిలో రాబట్టింది.

  మళ్లీ రిపీట్ చేయనున్నాడట

  మళ్లీ రిపీట్ చేయనున్నాడట

  ‘కొబ్బరి మట్ట' దర్శక నిర్మాతలు సంపూర్ణేశ్ బాబుతో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా కూడా కామెడీ ప్రధానాంశంగానే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఇందులో ‘కొబ్బరి మట్ట'కు మించిన ఎలిమెంట్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

  బడా డైరెక్టర్ సినిమాలో ఛాన్స్

  బడా డైరెక్టర్ సినిమాలో ఛాన్స్

  సంపూర్ణేశ్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది. ‘కంచె', ‘గమ్యం', ‘యన్.టి.ఆర్' బయోపిక్ వంటి చిత్రాలను తెరకెక్కించిన క్రిష్ జాగర్లమూడి త్వరలోనే సంపూతో సినిమా చేయబోతున్నాడన్నదే దాని సారాంశం. అయితే, ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేయడం లేదట. కేవలం దీనికి నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని ఫిలింనగర్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది.

  బాలయ్య నిర్మాత కూడా

  బాలయ్య నిర్మాత కూడా


  ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్న సీ కల్యాణ్ కూడా సంపూర్ణేశ్ బాబుతో త్వరలోనే సినిమాను ప్రారంభించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఓ పేరున్న దర్శకుడు తెరకెక్కిస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.

  రెమ్యూనరేషన్ పెంచేశాడు

  రెమ్యూనరేషన్ పెంచేశాడు

  ‘కొబ్బరిమట్ట' ఘన విజయం సాధించడంతో సంపూర్ణేశ్ బాబు రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఆయన మొదటి చిత్రం ‘హృదయ కాలేయం' సినిమాకు లక్ష రూపాయలు కూడా తీసుకోలేదని గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. దీని తర్వాత మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ సంపూ సాదాసీదా రెమ్యూనరేషనే తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే వెల్లడించాడు.

  కోలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇస్తున్నాడట

  కోలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇస్తున్నాడట

  ‘కొబ్బరి మట్ట' తర్వాత సంపూర్ణేశ్ బాబు.. రెండు సినిమాలను ఓకే చేసేశాడు. అలాగే తమిళంలోనూ ఓ సినిమా చేయడానికి సంతకం కూడా పెట్టేశాడు. ఈ సినిమాల కోసం సంపూ రోజుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరూ సంపూ రెమ్యూనరేషన్ చూసి షాక్‌కు గురవుతున్నారు.

  English summary
  Burning star Sampoornesh Babu.. One Of The Hero In Telugu Film Industry. He Is Very Famous with His First Film Hrudaya Kaleyam. This Movie Create Sensation In Tollywood. Now He acted Movie kobbari matta.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X