చంపేస్తామని బెదిరింపులు.. అండర్‌గ్రౌండ్‌‏కు వెళ్లిన స్టార్ డైరెక్టర్..

సినిమా.. ఆడియన్స్ మనసుకు నచ్చేలా తెరకెక్కిస్తే అవి బ్లాక్ బస్టర్‌గా మారుతుంది. లేకపోతే అట్టర్ ప్లాప్ గా మారుతుంది. కొన్ని సినిమాలు అయితే.. సినిమాలు అయితే.. ఇండస్ట్రీలో సెన్సెషన్ క్రియేట్ చేస్తాయి. బెంచ్ మార్క్ మూవీగా మారుతాయి. అయితే.. ఓ సినిమా మాత్రం విడుదలైన వెంటనే వివాదాలకు కేంద్రంగా మారింది. దర్శకుడి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సంఘటన టాలీవుడ్‌లో అప్పట్లో సంచలనంగా మారింది. 'చంపేస్తాం', 'తల-మొండం వేరు చేస్తాం' అంటూ వచ్చిన బెదిరింపులతో ఆ స్టార్ డైరెక్టర్ వారం రోజుల పాటు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాల్సి వచ్చిందట. అంతేకాదు, హీరోకూ ప్రాణహాని హెచ్చరికలు రావడంతో లైసెన్స్ గన్‌తో తిరిగిన పరిస్థితి ఏర్పడిందట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఏ సినిమా కోసం ఇంతటి హంగామా జరిగింది?

ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఒకప్పటి లెజండరీ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi). కుటుంబ కథా చిత్రాలకు కొత్త అర్ధం చెప్పిన ఆయన, నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ, సింధూరం, ఖడ్గం వంటి ఇండస్ట్రీ హిట్స్ అందించారు. ఎన్నో విజయాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన సినిమాలకు అప్పట్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే కాలక్రమేణా కొత్త తరహా దర్శకులు రంగంలోకి రావడం, ట్రెండ్ మారిపోవడంతో కృష్ణవంశీ కొంత వెనుకబడ్డారు. వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయనపై 'అవుట్‌డేటెడ్' అనే ట్యాగ్ కూడా పడింది.

Krishna Vamsi Throwback Interview Shocking Threats During Khadgam Release Revealed

చాలా గ్యాప్ తర్వాత 'రంగమార్తాండ'తో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇంతటి అనుభవం, టాలెంట్ ఉన్న దర్శకుడు నుంచి మరో మంచి సినిమా రావాలని మూవీ లవర్స్ ఎప్పుడూ కోరుకుంటునే ఉంటారు. ఈ డైరెక్టర్ సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన అభిప్రాయాలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ ఇటీవల డైరెక్టర్ కృష్ణవంశీకి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎదురైన షాకింగ్ సంఘటనలను తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన దేశభక్తి ప్రధాన చిత్రం 'ఖడ్గం' విడుదల సమయంలో ఎదురైన పరిస్థితులు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2002 నవంబర్ 29న విడుదలైన 'ఖడ్గం' సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ముఖ్య పాత్రల్లో నటించారు. సుంకర మధుమురళి నిర్మించిన ఈ సినిమాకు ఉత్తేజ్, సత్యానంద్ కథ, మాటలు అందించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దేశభక్తి, సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఐదు నంది అవార్డులను సొంతం చేసుకుంది.

ఇంకా ఈ సినిమాను ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26 వంటి జాతీయ పర్వదినాల్లో టెలికాస్ట్ చేయడం కూడా దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో పరిస్థితులు అంత సులభంగా లేవని కృష్ణవంశీ వెల్లడించారు. సినిమాలోని కొన్ని అంశాలను అపార్థం చేసుకున్న కొందరు వ్యక్తులు ఆయనకు తీవ్ర బెదిరింపులు చేసినట్లు తెలిపారు. 'తల, మొండం వేరు చేస్తాం' అంటూ వచ్చిన ఫోన్ కాల్స్‌తో భయాందోళనకు గురైన కృష్ణవంశీ, దాదాపు వారం రోజుల పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు.

ఈ బెదిరింపులు కేవలం దర్శకుడికే పరిమితం కాలేదు. హీరో శ్రీకాంత్‌కూ ప్రాణహాని హెచ్చరికలు రావడంతో, ఆయన కొన్ని రోజుల పాటు లైసెన్స్ గన్ వెంట తీసుకుని తిరిగినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, శ్రీకాంత్ కూడా సుమారు వారం రోజుల పాటు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనలు అప్పట్లో ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపాయి. 'ఖడ్గం' కథను 1993 ముంబై ఘటనల ఆధారంగా రూపొందించానని కృష్ణవంశీ చెప్పారు. ఈ సినిమాను మొదట చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో చేయాలని అనుకున్నారట.

కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ అడ్డొస్తాయని భావించి శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్‌లతో తెరకెక్కించినట్లు తెలిపారు. నిర్మాత శ్రీకాంత్ స్థానంలో మరో హీరోను తీసుకోవాలని సూచించినప్పటికీ, 'అవసరమైతే నిర్మాతనే మార్చేస్తాను కానీ శ్రీకాంత్‌ను మార్చను' అంటూ కృష్ణవంశీ కట్టుదిట్టంగా నిలబడ్డారని సమాచారం. అలాగే, ఈ సినిమాను అన్‌సీజన్‌లో విడుదల చేయడం వల్ల ఇండస్ట్రీ హిట్ స్థాయికి చేరుకోలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన టైమ్‌లో రిలీజ్ అయి ఉంటే మరింత పెద్ద విజయాన్ని సాధించేదని అన్నారు. 'ఖడ్గం' సినిమా కేవలం ఓ దేశభక్తి చిత్రం మాత్రమే కాదు... ఒక దర్శకుడి ధైర్యం, నిబద్ధత, ఎదురైన సవాళ్లకు నిదర్శనం అని చెప్పవచ్చు.

More from Filmibeat

Read more about: srikanth tollywood krishna vamsi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X