ప్రభాస్ పెట్టిన భోజనాలు చూస్తే మతి పోవాల్సిందే.. టన్నులలోనే నాన్ వెజ్.. ఎన్ని వెరైటీస్ అంటే..
రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణించిన తర్వాత మొగల్తూరు లోనే ప్రత్యేకంగా సంస్మరణ సభను నిర్వహించేందుకు ప్రభాస్ ఏర్పాట్లు చేశాడు. అన్నీ తానై దగ్గరుండి చూసుకున్న ప్రభాస్ వచ్చిన అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇక ప్రస్తుతం భోజనాలకు సంబంధించి అందరూ మాట్లాడుకునే రేంజ్ లోనే వంటకాలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్ని వెరైటీస్ సిద్ధం చేశారు అనే వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ కోసం ఫ్యాన్స్
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తర్వాత కేవలం సినీ ప్రముఖుల మాత్రమే కాకుండా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అప్సెట్ అయ్యారు. ఇక ఆయన మరణం తర్వాత ప్రభాస్ ను ప్రత్యేకంగా కలుసుకోవడానికి చాలామంది అభిమానులు ప్రయత్నాలు చేశారు. అయితే అందరినీ కలుసుకోవడం ప్రభాస్ కుదరలేదు. ఇక మొగల్తూరు రాగానే మాత్రం ఫ్యాన్స్ కు అభివదాలు తెలిపారు. అయితే ప్రభాస్ తన ఇంటికి వచ్చిన అభిమానులకి ప్రత్యేకంగా భోజనాలు కూడా పెట్టించారు.

మొగల్తూరులో..
ఇప్పుడు మొగల్తూరులో ప్రత్యేకంగా కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఏర్పాట్లుచేసిన విధానం రాష్ట్రం నలువైపులా కూడా హాట్ టాపిక్ గా మారుతొంది. సభకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ప్రత్యేకంగా భోజనాలు సిద్ధం చేసిన విధానం గురించి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

ప్రేమతో ప్రభాస్
ఇక వెజ్ నాన్ వెజ్ అని తేడా లేకుండా వివిధ రకాల వంటకాలను అభిమానుల కోసం సిద్ధం చేసి ఉంచినట్లు తెలుస్తోంది. కేవలం ముఖ్యమైన ఆధితులకు మాత్రమే కాకుండా ఫ్యాన్స్ అందరిని కూడా ఒకే తరహాలో ప్రేమించే ప్రభాస్ ఏర్పాట్లు చేసిన విధానం కూడా ఎంతగానో అట్రాక్ట్ చేశాయి. ఇక భోజనం చేసి వెళ్ళండి అంటూ ప్రభాస్ ముందుగానే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా మైక్ లోనే తెలియజేశాడు.

టన్నులలో నాన్ వెజ్ వంటకాలు
ఇక వంటకాల వివరాల్లోకి వెళ్తే గతంలో ఎప్పుడూ ఎవరు సిద్ధం చేయని విధంగా నాన్ వెజ్ వంటకాలు అయితే టన్నుల లెక్కలో ప్రిపేర్ చేయించినట్లు తెలుస్తోంది. 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల మటన్ బిర్యానీ, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు, 1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై.. ఇలా నాన్ వెజ్ లోనే దాదాపు 15 రకాలకు పైగా వెరైటీస్ వంటకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ముందు జాగ్రత్తగా..
అలాగే నాన్ వెజ్ మాత్రమే కాకుండా వెజ్ తినే వాళ్ళకి కూడా దాదాపు 20 రకాల వంటకాలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఎక్కడ అభిమానులకు ఇబ్బంది రాకుండా జరగకుండా ప్రభాస్ టీం ఆ విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఈ సభ కోసం లక్షకు మందికి పైగా జనాలు వస్తారు అని ముందే ఊహించారు. ఇక ముందస్తు జాగ్రత్త ప్రకారం లక్షా నలభై వేలకు పైగా భోజనాలు చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











