రెండు ఫ్లాప్‌ల తర్వాత ప్రభాస్ కీలక నిర్ణయం.. సినిమాలో ఆయన కచ్చితంగా ఉండాల్సిందే.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి విజయాలను అందుకున్న ఈ యంగ్ హీరో.. క్రమంగా కమర్షియల్ మూవీలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో అతడి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ విశ్వ వ్యాప్తం అయిపోయింది. దీని తర్వాత అతడి సినిమాలపై అంచనాలు పెరిగిపోవడంతో భారీ ప్రాజెక్టులను చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో యంగ్ రెబెల్ స్టార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. దాని కోసం ఓ బ్యాడ్ సెంటిమెంట్‌ను కూడా పట్టించుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం.? వివరాల్లోకి వెళితే...

హిట్ అవ్వకున్నా భారీగా ప్లస్ అయింది

హిట్ అవ్వకున్నా భారీగా ప్లస్ అయింది

ప్రభాస్‌తో యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో'. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ మూవీ నాలుగు భాషల్లో విడుదలైంది. ఇందులో శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. అయినప్పటికీ ప్రభాస్‌ కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా ఈ మూవీ బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు

రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘సాహో' తర్వాత కూడా ప్రభాస్ అదే తరహా ప్రాజెక్టును చేస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘జాన్' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. గోపీ కృష్ణా బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడట.

గ్యాప్ ఇచ్చిన ప్రభాస్.. ఎన్నో అనుమానాలు

గ్యాప్ ఇచ్చిన ప్రభాస్.. ఎన్నో అనుమానాలు

ఈ సినిమాను షూటింగ్ గతంలోనే ప్రారంభమైంది. యూరప్‌లో చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ, ‘సాహో' కోసం ఆ సినిమాను ఆపేశారు. అయితే, గత ఏడాది చివర్లో ‘జాన్' షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. దాని తర్వాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఈ సినిమా విషయంలో ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి.

ఫ్యాన్స్‌తో పాటు అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు

ఫ్యాన్స్‌తో పాటు అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు


ప్రభాస్ చాలా రోజుల పాటు షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా కూడా ఆలస్యం అవుతుందని అతడి అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ స్లిమ్‌ లుక్‌లో కనిపించడం చూసి వారంతా షాక్ అయ్యారు. ఈ గ్యాప్‌లో ప్రభాస్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్‌ స్టీవెన్‌ శిక్షణలో జిమ్‌లో కసరత్తులు చేశాడు. అందుకే ఈ లుక్‌లో కనిపించాడు.

సినిమాలో ఆయన కచ్చితంగా ఉండాల్సిందే.!

సినిమాలో ఆయన కచ్చితంగా ఉండాల్సిందే.!

జాన్‌లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయన ఈ సినిమాలో నటించడానికి వెనుక ప్రభాస్ పాత్ర ఉందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దర్శకుడితో చెప్పి మరీ ఆయన కోసం మంచి పాత్రను రాయించాడని అంటున్నారు. దీంతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెండు ఫ్లాప్‌ల తర్వాత ప్రభాస్ కీలక నిర్ణయం

రెండు ఫ్లాప్‌ల తర్వాత ప్రభాస్ కీలక నిర్ణయం


గతంలో కృష్ణం రాజు - ప్రభాస్ కాంబినేషన్‌లో ‘బిల్లా', ‘రెబెల్' అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండు మూవీలు బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. అయినప్పటికీ తన కొత్త సినిమాలో కృష్ణంరాజును నటింపజేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో హిట్ కొట్టి బ్యాడ్ సెంటిమెంట్‌కు బ్రేక్ వేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X