కుర్ర హీరోయిన్‌తో నితిన్ రొమాన్స్: అదిరిపోయే ప్లాన్ వేసిన కొత్త డైరెక్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతున్నాడు కాబట్టే ఈ హీరో వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. వీటితో పాటు త్వరలోనే 'మాస్ట్రో' అనే సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే నితిన్ మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. దీని గురించి తాజాగా ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
చాలా ఏళ్ల నుంచి టాలీవుడ్‌లో ఎడిటర్‌గా పని చేస్తోన్న ఎస్‌ఆర్ శేఖర్‌ను హీరో నితిన్ దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కబోతుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.

ఇక, ఇందులో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. తన పాత్రకు ఉన్న ప్రాధాన్యం నచ్చడంతో నితిన్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును నితిన్ సొంతం బ్యానర్‌పై నిర్మించబోతున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు నితిన్ 'మాస్ట్రో' అనే సినిమాలో నటించాడు. దీనికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయింది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ మూవీ 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇక, ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











