పవన్ దిగితే రికార్డుల లెక్కలు బద్దలవ్వాల్సిందే.. లాలా బీమ్లా లెక్కలో కొత్త రికార్డు ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనంత వరకే రికార్డులు, వన్స్ ఆయన అడుగుపెడితే రికార్డుల లెక్క మారాల్సిందే. తాజాగా ఆయన ఖాతాలో వచ్చిన రికార్డు వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనంత వరకే రికార్డులు, వన్స్ ఆయన అడుగుపెడితే రికార్డుల లెక్క మారాల్సిందే. తాజాగా ఆయన ఖాతాలో వచ్చిన రికార్డు వివరాల్లోకి వెళితే..

త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఆదివారం మరో సాంగ్‌ను విడుదల చేసింది. లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ తివిక్రమ్ స్వయంగా రాశారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు.

అభిమానులకు ఫీస్ట్
భీమ్లా నాయక్ లో పవన్ క్యారెక్టర్ అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట పవర్‌స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. "పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు... పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు..." అంటూ త్రివిక్రమ్ రాయగా దానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే భీమ్లా టైటిల్ సాంగ్‌తో పాటు అంత ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ లపై పాటను విడుదల ఛేఐగా దానికి కూడా మంచి స్పందన లభించింది.

ఆ సినిమా రీమేక్ గా
మలయాళంలో హిట్టైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. రానా ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బిగ్గెస్ట్ రికార్డ్
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు కానుకగా సాంగ్ ను రిలీజ్ చేయగా ఇప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులను వ్యూస్ పరంగా బద్దలు కొట్టింది. లైక్స్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు అవుతాయి అనుకుంటే టాప్ 2 ప్లేస్ తో సరిపెట్టుకున్నా వ్యూస్ పరంగా సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది లాలా భీమ్లా థీమ్ సాంగ్.

రికార్డ్ బ్రేక్
ఇప్పటిదాకా అల్లు అర్జున్ పుష్ప లోని.... సామి సామి సాంగ్ 24 గంటల్లో 9.06 మిలియన్ వ్యూస్ తో కొత్త రికార్డును నమోదు చేస్తే ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి 24 గంటల్లో 10.2 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని సౌత్ లో ఫస్ట్ టైం 24 గంటల్లో 10 మిలియన్ కి పైగా వ్యూస్ ని అందుకున్న ఫస్ట్ సాంగ్ గా సంచలన రికార్డ్ ను అందుకుని సౌత్ రికార్డ్ ను క్రియేట్ చేసింది.
Recommended Video

టాప్ లో ఇవే
'భీమ్లా నాయక్' లోని 'లాలా భీమ్లా' సాంగ్ తర్వాత ప్లేస్‌లో ఉన్న లిరికల్ సాంగ్స్ ఈ విధంగా ఉన్నాయి. భీమ్లా నాయక్ (లాలా భీమ్లా) - 10.2 మిలియన్స్, సామీ సామీ (పుష్ప) - 9.06 మిలియన్స్, దాక్కో దాక్కో మేక (పుష్ప) - 8.32 మిలియన్స్, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ - 8.28 మిలియన్స్, మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు) - 7.87 మిలియన్స్, రాములో రాములా (అల వైకుంఠపురములో) - 7.39 మిలియన్స్, శ్రీవల్లి (పుష్ప) - 6.9 మిలియన్స్ సాధించి టాప్ లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











