హీరో తరుణ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తల్లి.. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నాడంటూ..
టాలీవుడ్ లో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలలో నటించిన తరుణ్ తరువాత నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా తరుణ్ చేతిలోకి వెళ్ళే సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తరువాత కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా లవర్ బాయ్ గా దూసుకుపోయాడు. అయితే కొంతకాలం తరువాత అతను మెల్లగా ఫేడ్ అవుట్ అయ్యాడు అనే కామెంట్స్ వచ్చాయి. కానీ అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా తరుణ్ తనదైన శైలిలో విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తరుణ్ నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ఊహాగానాలు బాగానే వచ్చాయి. ఇక ఇటీవల తరుణ్ తల్లి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని పెళ్లి గురించి ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
వరుస ఫ్లాప్ లతో..:ఎక్కువగా ప్రేమకథతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ కొట్టిన తరుణ్ ఫ్యూచర్ స్టార్ హీరో అని అందరూ అనుకున్నారు. అయితే హీరోగా ఎంత వేగంగా సక్సెస్ లు అందుకొని స్టార్ గా మారాడో అంతే స్థాయిలో కెరియర్ లో వరుస ఫ్లాప్ లతో క్రింద పడిపోయాడు. 2009లో శశిరేఖ పరిణయం సినిమా వరకు తరుణ్ కెరియర్ స్పీడ్ గా కొనసాగింది. తరువాత నాలుగేళ్ల బ్రేక్ ఇచ్చాడు.

చాలా గ్యాప్ ఇచ్చిన తరువాత:2013లో చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అనే మూవీ చేశాడు. ఇది డిజాస్టర్ అయ్యింది. తరువాత 2014లో రెండు సినిమాలు చేస్తే అవి ఫ్లాప్ అయ్యాయి. మరల సుదీర్ఘ గ్యాప్ తీసుకొని 2018లో చివరిగా ఇది నా లవ్ స్టొరీ అనే మూవీ చేశాడు. ఆ తరువాత స్క్రీన్ పై ఇప్పటి వరకు కనిపించలేదు. అయితే త్వరలో ఒక సినిమా, వెబ్ సిరీస్ తో తరుణ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అతని తల్లి యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి చెప్పారు.

వ్యాపారాలలో బిజీగా ఉండటం వలన:ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకు తరుణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం తరుణ్ వ్యాపారాలలో బిజీగా ఉండటం వలన సినిమలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే త్వరలోనే రీ ఎంట్రీ ఉంటుందని అయితే వెబ్ సిరీస్ ద్వారానా, సినిమా ద్వారానా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు.

పెళ్లిపై స్పందిస్తూ..:తాను కూడా తరుణ్ మంచి సినిమాతో మళ్ళీ ప్రేక్షకులని అలరించాలని వెయిటింగ్ చేస్తున్నానని తెలిపారు. తన కుమారుడు పెళ్లి చేసుకోవాలని, అన్ని బాగుండాలని కోరుకుంటున్నా అన్నారు. తన చేతుల మీదుగా ఎంతో మందికి పెళ్లిళ్లు చేసినట్లు చెబుతూ.., ఆ ఆశీర్వాదాలు తనకు కుమారుడి దక్కుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనేది తరుణ్ ఇష్టమే అని క్లారిటీ ఇచ్చేశారు.


Click it and Unblock the Notifications











