RC 15: మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఓ పద్ధతి ప్రకారం వెళుతున్న శంకర్, చరణ్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి రాబోతోన్నాయి అని ఈ ఏడాది చాలా క్లారిటీగా అర్థం అయ్యింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమిళంలో స్టార్ దర్శకులు కూడా మన తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక మన సక్సెస్ ఫుల్ నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పాన్ ఇండియా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు శంకర్ తన సినీ జీవితంలోనే ఎప్పుడూ కూడా ఫాలో అవ్వని కొన్ని రూల్స్ ను కూడా ఫాలో అవుతున్నాడు. సాధారణంగా శంకర్ ఏ సినిమాను మొదలు పెట్టినా కూడా సినిమా పూర్తయ్యేవరకు తప్పకుండా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగానే పెరుగుతుంది. ఇక రామ్ చరణ్ 15వ సినిమా విషయంలో మాత్రం ఈ స్టార్ దర్శకుడు ఆవిధంగా చేయకుండా వీలైనంత వరకు అనుకున్న బడ్జెట్లోనే సినిమా నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. అలాగే అప్ డేట్స్ విషయంలో కూడా ఏమాత్రం తొందరపడకుండా సమయానికి తగ్గట్లుగా సినిమాను ప్రమోట్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు.

Latest new update on ram charan upcoming pan india project RC 15,

ఇక ఈ సినిమాను ఇదే వారంలో పుణేలో మొదలు పెట్టబోతున్నారు. దేశ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలో అంచనాలు ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని కూడా మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక శంకర్ కూడా ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన చేస్తున్న సినిమాలో అన్నీ కూడా వరుసగా ప్లాప్ అవుతున్నాయి. అప్ డేట్స్ విషయంలో ఒక ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసి ఆ తర్వాత రెగ్యులర్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

స్టార్స్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన టీజర్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉందట. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ తేజ్ శంకర్ సినిమా అనంతరం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరపైకి వచ్చే అవకాశం ఉందట. ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ హిందీలో జెర్సీ రీమేక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X