ఆమెతో చాట్స్ లీక్.. అడ్డంగా బుక్కయిన రాజ్ తరుణ్

టాలీవుడ్ సినిమా దగ్గర కొన్ని రోజులు పాటుగా హాట్ టాపిక్ గా వినిపిస్తున్న కాంట్రవర్సీ ఏదన్నా ఉంది అంటే అది యువ హీరో రాజ్ తరుణ్ కోసమే అని చెప్పాలి. కాగా రాజ్ తరుణ్ తన ప్రేయసి లావణ్యని మోసం చేసి మరో అమ్మాయి అది కూడా యువ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో సంబంధం పెట్టుకున్నాడు అంటూ లావణ్య అనే అమ్మాయి సడెన్ గా మీడియా ముందుకు వచ్చి ఒక ఝలక్ ఇచ్చింది. దీనితో ఒక్కసారిగా అందరి కళ్ళు వీరి ఇష్యూ వైపు తిరిగాయి.

కాగా ఇక్కడ నుంచి వీరిద్దరి వ్యవహారం రోజుకో కొత్త ట్విస్ట్, కొత్త మలుపు తిరుగుతూ ఒక థ్రిల్లర్ సినిమా మాదిరిగా మారింది. ఇంకా కొందరు అయితే రాజ్ తరుణ్ ఇప్పుడు వరకు చేసిన అన్ని సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్ట్ లు లేవు కదా అంటూ మాట్లాడుకున్నారు. ఇలా వీరి ఇద్దరి లవ్ మేటర్ లో యంగ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఎంటర్ కావడం ఆమెపై లావణ్య కూడా గట్టిగా ఆరోపించడం జరిగింది.

latest twist on raj tarun case chats with malvi got leaked

కానీ అక్కడ ఊహించని ట్విస్ట్ ఇస్తూ మాల్వి మల్హోత్రా అసలు రాజ్ తరుణ్ కి నాకు ప్రేమ లేదని నా ఫస్ట్ లవ్ ఎప్పుడూ సినిమానే మా ఇద్దరికీ సినిమా పరిచయం తప్ప ఇద్దరం ఇప్పుడు వరకు పర్శనల్ విషయాలు మాట్లాడుకున్నదే లేదు నేను ఎవరినీ ప్రేమంచనే లేదు అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. దీనితో లావణ్యనే కావాలని ఇద్దరిపై ఆరోపణలు వేస్తుంది అని చాలా మంది భావించారు.

కానీ ఇప్పుడు ఈ మేటర్ లో ఊహించని కొత్త మలుపు ఏంటంటే లావణ్య చేసిన ఆరోపణలు అన్నీ నిజమే అట. తాజాగా రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా తో చేసిన వాట్సాప్ చాట్స్ లీకయ్యాయి. ఇందులో చూస్తే మాల్వి రాజ్ తరుణ్ విషయంలో చెప్పిన మాటలు అన్నీ అబద్దం అని తేలింది. కాగా ఈ చాట్స్ ప్రకారం రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకి ఎప్పుడో 2023 లోనే ప్రపోజ్ చేస్తే ఆమె వెంటనే అతడికి ఓకే చెప్పేసిందట.

latest twist on raj tarun case chats with malvi got leaked

అంతే కాకుండా అక్కడ నుంచి ఇద్దరూ సెపరేట్ గా ఒక స్పెషల్ స్పాట్ ని పెట్టుకొని అక్కడే తరచూ కలవడం ఇంకా మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ కి ఎంతో ఖర్చులు పెట్టడం కూడా జరిగాయట. దీనితో ఈ ఇద్దరూ ప్రేమించుకుంది నిజమే అని తేలిపోయింది. అలాగే ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు అని చెప్పుకొచ్చిన రాజ్ తరుణ్ సహా మాల్వి మల్హోత్రా కూడా అడ్డంగా బుక్కయ్యిపోయారు అని చెప్పాలి.

మరి ఈ కొత్త ఊహించని ట్విస్ట్ తో వీరి మేటర్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో అనేది ఆసక్తిగా మారింది. కాగా ప్రస్తుతం ఇదే రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం "తిరగబడరా సామి" విడుదలకి రాబోతుంది. ఓ పక్క ఈ కేసుతో పాటుగా రాజ్ తరుణ్ ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Read more about: raj tarun malvi malhotra lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X