పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్.. కోవిడ్ నుంచి కోలుకున్నా కూడా ఆ బాధ తప్పట్లేదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన వైరస్ నుంచి వెంటనే కొలుకున్నప్పటికి ఆరోగ్యం ఇంకా పూర్తి స్థాయిలో కుదుటపడలేదని తెలుస్తోంది. వీలైనంత వరకు నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటేనే బెటర్ అని వైద్యులు కూడా సలహా ఇచ్చారు. ప్రస్తుతం పవన్ ఒక విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పుడే కోవిడ్ వచ్చింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైన క్రమంలో తిరుపతి ఎన్నికల కోసం పలు మీటింగ్ లలో పాల్గొన్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ రిలీజ్ సందర్భంగా కూడా ఎక్కడా ప్రమోషన్ లో పాల్గొనకుండా ప్రజల సమస్యలపై చర్చించేందుకు వెళ్లారు. ఆ క్రమంలోనే పవర్ స్టార్ కోవిడ్ బారిన పడ్డారు.

రామ్ చరణ్ కూడా
ఇక పవన్ కళ్యాణ్ కు కరోనా వైరస్ సోకింది అనగానే అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. నిరంతరం ప్రత్యేకమైన పూజలతో పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కూడా తన బాబాయ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకున్నారు.

నీరసంగా ఉండడం వలన
ఇక అభిమానుల నమ్మకం ప్రేమ వలన ఆయన తొందరగానే కొలుకున్నారు. దీంతో పూర్తి చేయాల్సిన సినిమా షూటింగ్స్ పనుల చాలా ఉన్నాయని పవన్ ఫాస్ట్ గా రెడీ అవ్వాలని అనుకుంటున్నాడు. కానీ ఆరోగ్యం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని సమాచారం. చాలా నీరసంగా ఉండడం వలన మరికొన్ని రోజులు రెస్ట్ అవసరమని వైద్యులు కూడా సలహా ఇచ్చినట్లు సమాచారం.

పూర్తి చేయాల్సిన సినిమాలు
ఇక పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. రానా మరో జీరోగా నటిస్తున్న ఆ సినిమా సమ్మర్ అనంతరం విడుదల చేయాలని అనుకున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హిస్టారికల్ మూవీ హరహర వీరమల్లు షెడ్యూల్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. కోవిడ్ వలన పవన్ ఆ షూటింగ్ ను మరికొన్ని రోజులు వాయిదా వేసుకోక తప్పడం లేదు.


Click it and Unblock the Notifications











