NTR 30: త్వరలోనే ఎన్టీఆర్ అభిమానులకు మరొక బిగ్ న్యూస్.. అలా సెట్ చేసిన కొరటాల శివ!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒకసారి ఒక పెద్ద సినిమాను రిలీజ్ చేసి హిట్టు కొడితే ఆ తరువాత కూడా అంతకుమించి అనేలా మరొక పెద్ద సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు వరుసగా పెద్ద సినిమాలు చేస్తే మధ్య మధ్యలో చిన్న సినిమాలు కూడా చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ఎఫెక్ట్ వలన హీరోల ఆలోచన విధానాలు చాలా మారిపోతున్నాయి. ఎందుకంటే అభిమానులు కూడా ఒక సినిమా హిట్ అయిన తర్వాత స్టార్ హీరోల తదుపరి ప్రాజెక్టులపై భారీ అంచనాలతో థియేటర్ లోకి వస్తున్నారు. దీంతో వారిని దృష్టిలో ఉంచుకొని అంతకుమించి సినిమాలు చేయడానికి హీరోలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఒక విధంగా సినిమా మార్కెట్ పెరగడానికి కూడా ఆ ఆలోచన విధానం ఎంతగానో హెల్ప్ అవుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాను ఒక్కసారి టచ్ చేస్తే మన అగ్రహీరోలు అస్సలు ఆ ఫార్మాట్ వదిలేలా లేరని అనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక అదే బాటలో RRR హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళుతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వరుసగా రెండు సినిమాలను నేషనల్ లెవల్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

మొదట కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఒక సందేశాత్మక సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమాతో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సారి అదే తరహాలో మరో మంచి సినిమాతో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాకు తుదిమెరుగులు దిద్దుతున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయంలో గత కొంత కాలంగా అనేక రకాలు వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా అక్టోబర్ రెండవ వారంలోనే సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే RRR సినిమా కి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే మొత్తానికి రాజమౌళి తో పని అయిపోవడంతో నెక్స్ట్ కొరటాల శివతో బిజీ బిజీగా గడపనున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొంత పూర్తయ్యాయి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని అనుకుంటున్నారు. అయితే విషయంలో కూడా త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించే ఛాన్స్ ఉందట. అభిమానులు కూడా ఎక్కువగా అతన్నే కోరుకుంటున్నారు. కొరటాల శివ ప్రాజెక్ట్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరొక యాక్షన్ సినిమాను లైన్ లో పెట్టబోతున్నాడు. ఆ సినిమా 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం


Click it and Unblock the Notifications











