'సర్కారు వారి పాట' కోసం మహేష్ దూకుడు.. మరో కొత్త ప్లాన్ రెడీ!

మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటాడు. దర్శకుడు కరెక్ట్ షెడ్యూల్ తో ప్లాన్ చేసుకోగలిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కష్టపడి వర్క్ చేస్తాడు. మహేష్ స్పీడ్ ఏమిటో బిజినెస్ మెన్ సినిమాతోనే అప్పట్లో చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక అదే తరహాలో చాలా సినిమాలను వేగంగానే ఫినిష్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వలన షూటింగ్ పనులను తొందరగా పూర్తి చేయలేకపోతున్నాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న మహేష్ బాబు ఆ తరువాత వెంటనే మరొక సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాడు. మొత్తానికి అనుకున్నట్లే పరశురామ్ దర్శకత్వంలో వర్క్ చేయడానికి ప్లాన్ తోనే రెడీ అయ్యాడు. కరోనా డోస్ ఈ రేంజ్ లో లేకపోయి ఉంటే ఈపాటికే ఆ సినిమా విడుదల హడావుడిలో ఉండేది. ఇక చేసేదేమీ లేక వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు.

 Latest update on mahesh babu Sarkaru Vaari Paata

ఇక ఇటీవల మహేష్ మరొక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో వచ్చే నెల చాలా మంది షూటింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సర్కారు వారి పాట టీమ్ కూడా ఇటీవల అదే తరహాలో చర్చించింది. వారితో మాట్లాడిన మహేష్ షూటింగ్ పనులను జూలై నుంచి కొనసాగించాలని డిసైడ్ అయ్యాడట. మరో మంచి డేట్ చూసుకొని వీలైనంత తోందరగా మేజర్ షెడ్యూల్స్ ను ఫినిష్ చేయాలని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఎలా అమలు చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X