Don't Miss!
- Sports
India vs Pakistan సమరానికి కాలు దువ్విన రోహిత్.. స్టార్ స్పోర్ట్స్ ప్రొమోకు ఫ్యాన్స్ ఫిదా!
- Lifestyle
రక్షాబంధనం రోజు జాతకం క్రింది విధంగా ఉంది: ఏఏ రాశులకు అదృష్టం మరియు దురదృష్టం ఇక్కడ తెలుసుకోండి..
- Finance
Microsoft: ఆపిల్ కంపెనీని దివాలా నుంచి కాపాడిన మైక్రోసాఫ్ట్.. ఎప్పుడో ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి..
- News
రాజకీయాల్లోకి రీఎంట్రీపై తేల్చేసిన రజినీకాంత్: నిన్న చంద్రబాబుతో..ఇవ్వాళ గవర్నర్తో భేటీ
- Technology
భారత్లో Tecno Camon 19 Pro 5G విడుదల అప్పుడేనా.. ధర ఎంతంటే!
- Automobiles
యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..
- Travel
ట్రెక్కింగ్ ప్రియులకు కొత్తగా పరిచయమైన హిల్స్టేషన్.. వంజంగి
RC 15: RRR కంటే మరో పవర్ఫుల్ ఫైట్ ప్లాన్ చేసిన శంకర్.. గతంలో ఎప్పుడు లేని విధంగా..
సంచలన దర్శకుడు శంకర్ మొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం RC 15 అంచనాలు అయితే మామూలుగా లేవు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ అధికారి అనే టైటిల్ అనుకుంటున్నట్లు చాలా రోజులుగా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే సగానికి పైగా పూర్తయింది. ఇక ఆగస్టు చివరిలోపు 70% షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.
షూటింగ్ మొత్తం అయితే ఈ ఏడాది డిసెంబర్ వరకు ఫినిష్ అవుతుందట. అయితే ప్రస్తుతం హీరో రామ్ చరణ్ అలాగే హీరోయిన్ కీయరా అద్వానీ మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో షూట్ చేస్తున్న ఆ సాంగ్ లో దాదాపు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్స్ పాల్గొంటున్నట్లు టాక్. ఈ సాంగ్ అనంతరం మరో బిగ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా పూర్తి చేయబోతున్నారట. అందులో రామ్ చరణ్ ఒకేసారి 1200 మందితో పోరాటం చేస్తాడని తెలుస్తోంది.

RRR సినిమాలో ఎలాగైతే ఎంట్రీ సీన్ లో వేలాది మందితో రాంచరణ్ ఎంట్రీ ఉంటుందో అదే తరహాలో ఇప్పుడు శంకర్ కూడా చాలా పవర్ ఫుల్ గా యాక్షన్ బ్లాక్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ షూటింగ్ అనంతరం సెప్టెంబర్ చివరిలో శంకర్ మరికొన్ని విభిన్నమైన సన్నివేశాలను చిత్రీకరించినందుకు విదేశాలకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ మధ్యలో కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలను షూట్ చేస్తారట. ఇక తర్వాత డిసెంబర్ సమయానికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. అసలైతే అది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలి అని నిర్మాత దిల్ రాజు చాలా అనుకున్నారు. కానీ షూటింగ్ పనులు కొంత ఆలస్యం కావడంతో ఇప్పుడు సినిమాను 2023 సమ్మర్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.