బంపర్ ఆఫర్ కొట్టేసిన లావణ్య.. ఇక్కడ కాదు అక్కడ
లావణ్య తిపాఠి.. తెలుగు తక్కువ సినిమాల్లోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి. చేసింది కొన్ని సినిమాలే అయినా తన క్యూట్‌నెస్‌తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంటోంది. గ్లామరస్ పాత్రలకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చినా.. ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తోన్న ఈ బ్యూటీ.. అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిందని తెలిసింది.
తెలుగులో అవకాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లావణ్య త్రిపాఠి కోలీవుడ్‌లో మాత్రం బంపర్ ఆఫర్ పట్టేసిందని తెలుస్తోంది. ఇటీవల 'కోమలి' అనే సినిమాతో హిట్ కొట్టిన జయం రవి తర్వాతి చిత్రంలోనే లావణ్య నటించబోతుందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయట. అదే సమయంలో ఆమెకు మరో అవకాశం కూడా దక్కిందని అంటున్నారు. ఓ యంగ్ హీరో చేయబోయే సినిమాలో గ్లామర్ రోల్ పట్టేసిందట ఈ అందాల రాక్షసి.

మరోవైపు, లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేవు. ఇక, ఆమె తాజాగా నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మొదట ఈ సినిమాకు 'ముద్ర' అనే టైటిల్ అనుకున్నారు. అయితే, అదే పేరుతో కొద్దిరోజుల క్రితం ఓ సినిమా విడుదలైంది. దీంతో 'అర్జున్ సురవరం' అనే పేరు పెట్టారు.
అయితే, ఏదో ఒక కారణంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది. ఆమెకి ఈ సినిమా హిట్ కీలకం. కానీ 'అర్జున్ సురవరం' అసలు విడుదల అవుతుందా అనే సందేహం


Click it and Unblock the Notifications











