100 మంది పిల్లలతో స్టార్ హీరో ఇంట్రడక్షన్.. కేక పెట్టించబోతున్నారు!
ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ దూసుకుపోతున్నాయి. వరుస విజయాలతో విజయ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాస్త పర్వాలేదని టాక్ వచ్చినా వందల కోట్ల వసూళ్లు నమోదవుతున్నాయి. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్రం విషయంలో అదే జరిగిది. కత్తి, తుపాకీ, తేరి, మెర్సల్, సర్కార్ ఇలా బ్లాక్ బస్టర్ విజయాలతో విజయ్ తమిళంలో తిరుగులేని హీరోగా మారిపోయాడు.
ఇదిలా ఉండగా దర్శకుడు అట్లీ, విజయ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో మైఖేల్ అనే చిత్రం ప్రారంభమైంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేసిన దర్శకుడు రెండవ షెడ్యూల్ లో విజయ్ ఇంట్రడక్షన్ సీన్, సాంగ్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల్లో విజయ్ 100 మంది పిల్లలతో నటిస్తాడట. దీనికోసం అట్లీ డాన్స్ తెలిసిన 100 మంది చిన్న పిల్లలని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ కు జోడిగా క్రేజీ హీరోయిన్ నయనతార నటిస్తోంది. మెర్సల్ చిత్రంలో వైద్యరంగం ఆవశ్యకతని తెలియజేసిన అట్లీ ఈ చిత్రంలో క్రీడారంగంలో రాజకీయాలపై అస్త్రం సంధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











