twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెజాన్‌లో కార్చిచ్చు.. టైటానిక్ హీరో 36 కోట్ల భారీ విరాళం

    |

    అమెజాన్ అడవులను కార్చిచ్చు దహించి వేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అమెజాన్ అడవుల్లో మంటలు చెలరేగి వేలకొద్ది ఎకరాలు బూడిగా మారడంపై అన్ని వర్గాలు తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. పర్యావరణం మనుగడకు చేయూతనిద్దామని పలువురు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ నటుడు లియోనార్డో డీకాప్రియో కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. పర్యావరణానికి సహాయం చేసే ఎర్త్ అలియెన్స్ అనే సంస్థను కూడా నిర్వహిస్తున్న డికాప్రియో దాదాపు 5 మిలియన్ల డాలర్లను విరాళంగా ప్రకటించడం సంచలనం రేపింది.

    ప్రపంచ మానవాళికి అమెజాన్ ప్రాణవాయువు లాంటింది. భూ ఉష్ణోగ్రతను కట్టడి చేయడంలో అమెజాన్ అడవులు గణనీయమైన మేలు చేస్తున్నది అని డీ కాప్రియో ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు. టైటానిక్ తదితర చిత్రాలతో డి కాప్రియో ప్రపంచ సినీ ప్రేక్షకుల చేరువైన సంగతి తెలిసిందే.

    Leonardo DiCaprio donates 36 crores for Amazon rainforest aid

    గత జూలైలో డి కాప్రియో ఎర్త్ ఎలియెన్స్ అనే సంస్థను స్థాపించాడు. లారెన్స్ పావెల్ జాబ్స్, బ్రియన్ షేత్, పలువురు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలతో కలిసి జంతు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ పరిస్థితులకు సహకారం అందించే విధంగా సహకరిస్తున్నారు.

    అమెజాన్‌ అడవుల్లో సాధారణ స్థితి నెలకొనేందుకు అమెజాన్ ఫారెస్ట్ ఫండ్ అనే సంస్థ స్థానికులతోనూ, ఇతర కమ్యూనిటీలతో కలిసి కార్యాచరణను ప్రారంభించింది. అమెజాన్‌ పర్యావరణం నుంచి కాపాడేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి.

    ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో దాదాపు 72 వేల చెట్లు బూడిదయ్యాయని బ్రెజిల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ పేర్కొన్నది.

    Read more about: leonardo dicaprio
    English summary
    ollywood actor Leonardo DiCaprio, who owns environmental foundation Earth Alliance. He will donate 5 million dollars to Amazon Forest Fund to support indigenous communities and habitats of the Brazilian rainforest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X