పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సుధాకర్ కోమాకుల దంపతులు.. చిన్నారి పేరు ఏంటో తెలుసా?
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన సుధాకర్ కోమాకుల దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అమెరికాలోని చికాగోలో ఆయన సతీమణి హారిక సందేపోగు మే 14వ తేదీన మగబిడ్డకు జన్మను ప్రసాదించింది. ఈ ఆనందమైన క్షణాలను నటుడు సుధాకర్ కోమాకుల తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులతో పంచుకొన్నారు. ప్రసవం తర్వాత తల్లి, చిన్నారి ఆరోగ్యం బాగుంది. ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని ఓ ప్రకటనలో తెలిపారు.
దుష్టశక్తిని పారదోలే విధంగా, శివుడికి మరో పేరు అయిన రుద్ర అనే పేరును తమ కుమారుడికి పెట్టుకొన్నాం అని సుధాకర్ కోమాకుల దంపతులు తెలిపారు.
రుద్ర తమ జీవితంలోకి రావడంపై సుధాకర్, హారిక ఆనందంలో మునిగి తేలుతున్నారు. తల్లిదండ్రులుగా గొప్ప అనుభూతిని పొందుతున్నాం. మా వివాహ వార్షికోత్సవానికి వారం ముందుగానే మా ఇంటిలోకి చిన్నారి రావడంతో సంతోష సాగరంలో మునిగాం. దేవుడు మాకు ప్రసాదించిన గొప్ప బహుమతిగా ఫీలవుతున్నాం అని సుధాకర్ కోమాకుల దంపతులు తెలిపారు. తండ్రి అయిన సుధాకర్‌కు మాతృత్వపు అనుభూతిని పొందుతున్న హారికకు శుభాకాంక్షలు అందించారు. చిన్నారి రుద్రా కోమాకులను నెటిజన్లు ఆశీర్వదించారు.

సుధాకర్ కోమాకుల దంపతుల విషయానికి వస్తే.. ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఛాలెంజ్ చిత్రంలో ఇందువదన పాటకు డ్యాన్స్ చేసి మెగాస్టార్‌కు ట్రిబ్యూట్ అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ దంపతులను కొనియాడటం, స్వయంగా ఇంటికి ఆహ్వానించడంతో వారు మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారారు.
ఇటీవల కార్తీకేయ గుమ్మకొండ నటించిన రాజా విక్రమార్క చిత్రంలో సుధాకర్ కోమాకుల ఓ కీలకపాత్రను పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. ఇంకా ఆయన నటించిన పలు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











