లిప్‌లాక్ సీన్ల ప్రభావం మా జీవితాలపై తీవ్రంగా ఉంటుంది: విజయ్ దేవరకొండ

Recommended Video

Vijay Devarakonda Talk About Kissing Scenes In Movies || Filmibeat Telugu

కథ అవసరాన్ని బట్టో... ప్రేక్షకులకు ఎక్స్‌ట్రా కిక్ ఇవ్వాలనే దర్శకుడి సూచన మేరకో హీరో హీరోయిన్లు కొన్నిసార్లు సినిమాల్లో లిప్ లాక్ ముద్దు సీన్లు చేయాల్సి ఉంటుంది. ఈ సీన్లు ఆడియన్స్‌కు వినోదం పంచినప్పటికీ ఆ ప్రభావం తమ జీవితాలపై తీవ్రంగా ఉంటుంది అంటున్నారు తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ.

'డియర్ కామ్రేడ్' సినిమా ప్రమోషన్లో భాగంగా తమిళనాడు వెళ్లిన ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లిప్ లాక్ సీన్ల ప్రస్తావన రావడంతో విజయ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రేక్షకులకు వినోదం పంచడానికి కొన్ని సార్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించక తప్పడం లేదు. అయితే వీటి వల్ల తర్వాత వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు.

సినిమా వెనక ఎంతో మంది భవిష్యత్

సినిమా వెనక ఎంతో మంది భవిష్యత్

ఇలాంటి సీన్లు చేయడం వల్ల కొందరు మా గురించి హేళనగా మాట్లాడతారు, సినిమాల్లో మేము నటించే కొన్ని సీన్ల వల్ల నిజ జీవితంలో మా క్యారెక్టర్లు ఇలా, అలా అని చర్చించుకుంటారు. కానీ ఒక సినిమా వెనక ఎంతో మంది భవిష్యత్ ఉంటుందనేది చాలా మంది పట్టించుకోరని విజయ్ వ్యాఖ్యానించారు.

సినిమా అంటే మాకు సీరియస్

సినిమా అంటే మాకు సీరియస్

మేము సినిమాను చాలా సీరియస్‌గా తీసుకుంటాం... ఎందుకంటే అందులో మా భవిష్యత్ ఉంటుంది. నిర్మాత డబ్బు ఉంటుంది. దర్శకుడి జీవితం ఉంటుంది. మేము ఏం చేసిన చివరకు ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా చేస్తామని విజయ్ చెప్పుకొచ్చారు.

అలాంటపుడు బాధేస్తుంది

అలాంటపుడు బాధేస్తుంది

సినిమాలు చూసి మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడినపుడు చాలా బాధేస్తుంది. కానీ అన్నీ భరిస్తాం. సినిమా రిలీజైన తర్వాత లభించే విజయంతో అవన్నీ మరిచిపోతాం. అందుకే సినిమాలను సినిమాలానే చూడాలి. సినిమాలో వినోదం పంచడం కోసం మేము చేసే పనులకు, నిజ జీవితాలకు ముడి పెట్టవద్దు అని విజయ్ దేవరకొండ కోరారు.

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X