కరోనా ఎఫెక్ట్.. ఆ సినిమా చేయలేనని చేతులెత్తేసిన నాని!
లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రతి సినిమా ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్ ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. సినిమా థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారు అనే విషయంలో ఇంతవరకు సరైన క్లారిటీ అయితే లేదు.
ఇకపోతే కొందరు మొదలుపెట్టకముందే కొన్ని ప్రాజెక్టులను ఎంతకైనా మంచిది అని స్టార్ట్ చేయడం లేదు. నాని కూడా త్వరలో ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నాడు. హీరోగా ఇప్పటికే V సినిమాను పూర్తి చేసిన నాని సమ్మర్ లోనే రిలీజ్ చేయాల్సింది. కానీ వైరస్ కారణంగా ఆ సినిమా కూడా రిలీజ్ కి నోచుకోలేదు. అసలు ఎప్పుడు వస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు.

ఇకపోతే నాని 'హిట్' సినిమాకు సీక్వెక్ ని నిర్మించాలని అనుకున్నాడు. సిశ్వక్ సేన్ కథానాయకుడిగా వచ్చిన ఆ ఇన్వెస్ట్ గేషన్ మూవీకి ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే కథకు సీక్వెల్ కథను సిద్ధం చేయగా వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని అనుకున్నాడు నాని. కానీ కరోనా భయానికి ఇప్పుట్లో రిస్క్ చేయకూడదని కొన్నాళ్లపాటు ప్రొడక్షన్ అనే పదానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడట. ఏదైనా కరోనా తగ్గిన తరువాతే ప్లాన్ చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











