ప్రభాస్ చేయబోయే సినిమాపై ముందే హింట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్.. మామూలుగా ఉండదట!
ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీలోని అగ్ర దర్శకులతో కూడా అతను కొన్ని కథలపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్న ప్రభాస్ తప్పకుండా ఆ సినిమాతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అని అనిపిస్తుంది.
ఇక మరోవైపు తమిళ ప్రముఖ దర్శకులు కూడా ప్రభాస్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల అతను లోకేష్ కనగరాజ్ చెప్పిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న ఆ దర్శకుడు ఫస్ట్ లుక్ తోనే మరింత అంచనాలను పెంచేసాడు. ఇక ఒక ప్రమోషన్ లో పాల్గొన్న అతను ప్రభాస్ సినిమాపై కూడా స్పందించినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వెలబడుతున్నాయి.

ప్రభాస్ తో చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఇదివరకే మేయిన్ స్టోరీ లైన్ కూడా చెప్పినట్లుగా ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. చెప్పిన కథకు ప్రభాస్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ తప్పకుండా లోకేష్ కనగరాజ్ ప్రభాస్ కాంబినేషన్లో అయితే ఒక సినిమా ఉంటుందని తెలుస్తోంది.

లియో సినిమా ఫినిష్ చేసిన తర్వాత దర్శకుడు లోకేష్ మరో కొత్త కథ కోసం ఇతర హీరోలతో సంప్రదింపులు జరుపనున్నాడు. ఇక ముఖ్యంగా అతను తన ప్రతీ కథను మరొక కథకు లింక్ చేసే విధంగా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తో వెళ్తున్నాడు. ఇక ప్రభాస్ తో చేయబోయే సినిమా కూడా దాదాపు అదే తరహాలో ఉండబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ప్రభాస్ కూడా అలాంటి సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. మరి ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











