టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్‌లో విజయ్ సేతుపతి 'మమనిధన్'కు అరుదైన గౌరవం
విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రం మామనిథన్ టోక్యో ఫిల్మ్ అవార్డ్స్‌లో టాప్ అవార్డును కైవసం చేసుకుంది. విజయ్ సేతుపతి అలాగే గాయత్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది బెస్ట్ ఏసియన్ ఫిలిం విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా శీను రామసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మామనిథన్'. ఈ సినిమా షూటింగ్ 2019లో పూర్తి కాగా, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కాగా, ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా నటించిన మామనిథన్ చిత్రాన్ని ఈ ఏడాది టోక్యో ఫిల్మ్ అవార్డ్స్‌కు పంపగా, ఇప్పుడు ఈ చిత్రం గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది.
ఈ సమాచారాన్ని దర్శకుడు శీను రామసామి తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ నిర్మాత యువన్ శంకర్ రాజాకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో అభిమానులు, నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. "మా #మామనిథన్ ఫీచర్ ఫిల్మ్ టోక్యో ఫిల్మ్ అవార్డ్స్ 2022 ని గెలుచుకుందనే విషయం షేర్ చేయడం ఆనందంగా ఉంది." ఈ సందర్భంగా చిత్ర నిర్మాత యువన్ శంకర్ రాజా, చిత్రబృందంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సాదాసీదా జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి తన పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ నాణ్యమైన విద్యను అందించాలనే తపనతో తెరకెక్కిన చిత్రం 'మమనిథన్'. దీని కోసం తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం విజయ్ సేతుపతి ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తితో చేతులు కలుపుతాడు.

అలా వెళ్ళిన ఆయన మోసపోతాడు. జీవితంలోని ప్రాథమిక విషయాలను పొందేందుకు ఒక సామాన్యుడు చేసే అపారమైన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. తమిళనాట గ్రామీణ కథలు చెప్పడంలో పేరుగాంచిన శీను రామసామి, విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం అయిన ''తెన్మేర్కు పరువుకాట్రు'' సినిమాకు గాను జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇక చాలా సంవత్సరాలుగా, సేతుపతి మరియు రామసామి నాలుగు ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేశారు. సినిమా విడుదలైనప్పటి నుంచి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా చిత్రబృందం అంచనాలను అందుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications











