మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలెంటెడ్ హీరో నితిన్ కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా గతంలో మాదిరిగా అయితే సక్సెస్ కావడం లేదు. చివరగా నితిన్ నుంచి 2020 లో వచ్చిన భీష్మ సినిమా మాత్రమే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. గత ఏడాది నుంచి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

ఆ తర్వాత వచ్చిన రంగ్ దే సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. బాలీవుడ్ అంధాదూన్ రీమేక్ మూవీని మొదట థియేటర్ లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. ఓ వర్గం ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇంతకుముందు నితిన్ వరుస అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సినిమా మార్కెట్ పై ఏ మాత్రం పెద్దగా ప్రభావం పడలేదు ఈ సినిమాతో నితిన్ 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 Macherla niyojakavargam movie Pre-Release Event ON August 7th

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ విడుదల అయ్యాక సినిమా మీద మరింత్ బజ్ ఏర్పడింది. ఇక శ్రీశ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిధి ఎవరు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X