అమ్మ కోరిక రెండేళ్ల తర్వాత తీర్చిన మాధవన్, గడ్డం లేకుండా..
సౌత్ స్టార్ మాధవన్ త్వరలో 'రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీని కోసం గత రెండేళ్లుగా మాధవన్ గడ్డం తీసేయలేదు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా క్లీన్ షేవ్‌తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'హ్యాపీ మదర్స్ డే అమ్మా... ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత నువ్వు కోరిన విధంగా క్లీన్ షేవ్‌తో నీ ముందుకు రాగలిగాను. యంగ్ నంబి నారాయణన్ ఇపుడు ఫ్రాన్స్ వెళుతున్నాడు.' అంటూ ట్వీట్ చేశారు. మాధవన్ పోస్ట్ చూస్తుంటే ఫ్రాన్స్‌లో జరిగే 'రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్' షూటింగకు బయల్దేరుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో నంబి నారాయణన్ మాదిరిగా గడ్డం పెంచి డిఫరెంట్ లుక్‌లో మాధవన్ కనిపించబోతున్నారు. ఇందులో కేవలం నటించడం మాత్రమే కాదు, తమిళ దర్శకుడు అనంత్ మహదేవన్‌తో కలిసి దర్శకత్వ బాధ్యతలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

నంబి నారాయణన్ ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డట్లు 1994లో అతడిపై ఆరోపణల రావడంతో అప్పట్లో 50 రోజులు జైల్లో గడిపారు. అయితే అవి నిజం కాదని సీబీఐ 1996లో కొట్టిపారేసింది. 1998లో సుప్రీం కోర్టు సైతం అతడు ఏ తప్పూ చేయలేదని తీర్పు తేల్చింది. ఈ సంఘటనకు సంబంధించిన అంశాలను ఫోకస్ చేస్తూ 'రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్' సినిమా సాగుతుంది.


Click it and Unblock the Notifications











