‘ఇర్ఫాన్ ఖాన్’‌ను మళ్లీ అలా బతికించారు.. రుణం తీర్చుకొన్న దత్తత గ్రామస్థులు!

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతితో సినీ ప్రపంచమే కాకుండా సాధారణ ప్రజలు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన ఇకలేరనే వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29న ఈ లోకం నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషాద ఘటన అందరికీ తెలిసిందే. అయితే మరణాంతరం ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. మహారాష్ట్రలోని ఓ గ్రామ ప్రజలు తమ ఊరిలోని ఓ ప్రాంతానికి ఆయన పేరు పెడుతూ నిర్ణయం తీసుకొంటూ ఇర్ఫాన్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

 ఇగత్‌పురి గ్రామస్థులతో అనుబంధం

ఇగత్‌పురి గ్రామస్థులతో అనుబంధం

మహారాష్ట్రలోని ఇగత్‌పురి గ్రామంలో ఇర్ఫాన్ ఖాన్‌కు ఓ ఫామ్ హౌస్ ఉంది. కొద్దికాలం క్రితం ఆ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకొన్నారు. అక్కడి ప్రజలకు ఆర్థికంగాను, అలాగే ఇతర రూపంలోను సహాయ సహకారాలు అందించారు. అక్కడి గ్రామస్థుల కోసం అంబులెన్స్, కంప్యూటర్లు, బుక్స్, రెయిన్ కోట్స్, పిల్లలకు స్వెటర్లు, పండుగ సమయంలో ప్రజలకు స్వీట్లు పంచడం చేస్తుండే వారు. ఇర్ఫాన్ ఖాన్ మరణాంతరం ఆయన చేసిన సేవలను ఇగత్ పురి గ్రామస్తులు గుర్తుంచుకొన్నారు.

మా గ్రామానికి ఎలాంటి అవసరం వచ్చినా..

మా గ్రామానికి ఎలాంటి అవసరం వచ్చినా..

ఇర్ఫాన్ ఖాన్ గురించి ఇగత్‌పురి జిల్లా పరిషత్ సభ్యుడు గోరఖ్ బోడ్కే స్పందిస్తూ.. ఆయన మా గ్రామానికి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పెద్ద మనసును చాటుకొంటూ గ్రామానికి ఏది అవసరమైనా వెంటనే స్పందించే వారు. పదేళ్ల క్రితం ఇక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ గ్రామంతో ఆయనకు అనుబంధం పెరిగింది అని తెలిపారు.

పదేళ్లుగా విడదీయలేని అనుబంధం

పదేళ్లుగా విడదీయలేని అనుబంధం

ఇగత్‌పురితో ఇర్ఫాన్ ఖాన్‌కు అనుబంధం విడదీయలేనిది. పదేళ్లుగా ఆయన ఈ గ్రామానికి సేవలందిస్తున్నారు. ఆయన ఇంటిని కొనుగోలు చేసినప్పుడు గ్రామస్తులు కలిసి సహాయం చేయాలని ఆర్థించారు. అప్పటి నుంచి ఎలాంటి సహకారం కోరినా ఆయన కాదనలేదు. అలాంటి వ్యక్తి మాకు దూరం కావడం చాలా బాధగా ఉంది. అందుకే ఆయన మా హృదయాల్లో నిలిచిపోయేలా మా గ్రామంలోని ఓ ప్రాంతానికి ఇర్ఫాన్ ఖాన్ పేరు పెట్టుకొన్నాం అని గ్రామస్థులు తెలిపారు.

Recommended Video

Irrfan Khan To Act Prabhas And Nag Ashwin's Movie But We Missed Him In Second Telugu Movie
మేము ఒంటరి కాదు.. ఇర్ఫాన్ ఖాన్ భార్య

మేము ఒంటరి కాదు.. ఇర్ఫాన్ ఖాన్ భార్య

ఇర్ఫాన్ ఖాన్ మరణాంతరం ఆయన భార్య సుతాపా సిక్దర్ విషాదం నుంచి తేరుకొని ఎమోషనల్'గా స్పందించారు. మేము ఎప్పుడూ ఒంటరి వాళ్లం కాదు. లక్షలాది మంది అభిమానులు మా వెంట ఉన్నారు. మా కష్ట సుఖాల్లో వారు భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇర్ఫాన్ లేని లోటును అభిమానుల్లో చూసుకొంటాం. ఆయన మనకు దూరం కాలేదు. మన హృదయాల్లోనే ఉన్నారు. కష్ట సమయాల్లో ఎలా ఉండాలో ఇర్ఫాన్ మాకు నేర్పించారు అని సుతాపా పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X